కరేబియన్లకు చుక్కలు చూపించిన భారత్ బౌలర్లు….సెమీస్‌కు చేరువలో కోహ్లీసేన

World Cup 2019.. Kohli Dhoni and Shami fire India to 125-run win
Share Icons:

మాంచెస్టర్:

 

ప్రపంచ కప్‌లో టీమిండియా అదరగొడుతుంది. వరుస విజయాలతో దూసుకెళుతుంది. మాంచెస్టర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ, ధోనీ, పాండ్యాలు రాణించడంతో భారత పోరాడే స్కోరుచేసింది. ఆ తర్వాత భారత్ బౌలర్లు  తమదైన శైలిలో రెచ్చిపోయి…కరేబియన్ బ్యాట్స్‌మెన్స్‌కి చుక్కలు చూపించారు. ఫలితంగా ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ఐదో విజయాన్ని నమోదు చేసుకుంది.

 

గురువారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 125 పరుగుల భారీ తేడాతో వెస్టిండీస్‌పై విజయం సాధించి పట్టికలో రెండో స్థానానికి చేరింది. ఇక ఈ విజయంతో భారత్ సెమీస్‌కు మరింత చేరువ కాగా.. విండీస్ ఐదో పరాజయంతో అధికారికంగా నాకౌట్‌కు దూరమై ఆఫ్ఘనిస్థాన్, దక్షిణాఫ్రికా సరసన చేరింది.

 

ఇక టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 7 వికెట్లకు 268 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (82 బంతుల్లో 72; 8 ఫోర్లు), మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (61 బంతుల్లో 56 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలు సాధించగా.. లోకేశ్ రాహుల్ (64 బంతుల్లో 48; 6 ఫోర్లు), హార్దిక్ పాండ్యా (38 బంతు ల్లో 46; 5 ఫోర్లు) మంచి ప్రదర్శన చేశారు.

 

విండీస్ బౌలర్లలో రోచ్ (3/36), హోల్డర్ (2/33) నిప్పులు చెరిగారు. అనంతరం లక్ష్య ఛేదనలో షమీ (4/16), బుమ్రా (2/9), చహల్ (2/39) బెంబేలెత్తించడంతో వెస్టిండీస్ 34.2 ఓవర్లలో 143 పరుగులకు ఆలౌటైంది. అంబ్రీస్ (31) టాప్‌స్కోరర్. కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

 

ఇక వరల్డ్ కప్‌లో భాగంగా నేడు శ్రీలంక-దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది.

 

Leave a Reply