ఇక ఆఫీసుకొచ్చేయండి: ఉద్యోగులకు విప్రో చైర్మన్ పిలుపు

Share Icons:
  • తగ్గుతున్న కరోనా ఉద్ధృతి
  • వారానికి రెండు రోజులు ఆఫీసు నుంచే పని
  • ఉద్యోగుల సురక్షిత  ఏర్పాట్లు
  • వ్యాక్సినేషన్ పూర్తయిన వారు మాత్రమే

కరోనా మహమ్మారితో గత 18 నెలలుగా ఇంటి పట్టునే ఉండి ఉద్యాగాలు చేసుకుంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఆటవిడుపుకు ఇక ఫుల్ స్టాప్ పెట్టాలని కంపెనీ లు భావిస్తున్నాయి. ఇప్పటికే కొంతమంది ఇంటి దగ్గర ఉండి ఉద్యోగం చేయడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అనేక కంపెనీ లు ఉద్యోగులను ఆఫీస్ లకు రావాలని పిలుస్తున్నాయి. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ ఆదిశగా ఆలోచనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు విప్రో కూడా తమ ఉద్యోగులను ఆఫీస్ లకు వచ్చేయండి అని పిలుపు నిచ్చింది…… సోమవారం నుంచి కార్యాలయాలకు రావాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసింది., కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తి చేసుకున్న వారిని మాత్రమే అనుమతించనున్నట్టు తెలిపింది. ప్రస్తుతానికైతే వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ఆ సంస్థ చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ  ట్వీట్ చేశారు. ఆఫీసుకి సురక్షితంగా వచ్చి వెళ్లేలా అన్ని ఏర్పాట్లు చేసినట్టు వివరించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో కూడా షేర్ చేశారు.

కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply