ముంబైలో మహిళా ఎగ్జిబిషన్ ఐపీఎల్

Share Icons:

ముంబై, మే 22:

2008 నుండి భారతదేశంలో ప్రతి  సంవత్సరం ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న విషయం అభిమానులందరికీ తెలుసు. ప్రపంచంలో ఏ  ఇతర మ్యాచ్ కి లేనంత క్రేజ్ ఐపీఎల్ కు ఉంది.

క్రికెట్ అభిమానులు కేవలం పురుషులకు మాత్రమే కాక స్త్రీలకు కూడా ఐపీఎల్ ఉంటే ఇంకా బావుంటుంది అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మహిళా ఐపీఎల్ నిర్వహించే ప్రక్రియలో భాగంగా బీసీసీఐ ఇటీవల మహిళా జట్లను ఎంపిక చేసింది. ఇందులో “ఐపియల్ ట్రయిల్ బ్లేజర్స్” పేరుతో ఒక జట్టు మరియు “ఐపియల్ సూపర్ నోవాస్” పేరుతో రెండు జట్ల వివరములను ప్రకటించింది.

ఐపీఎల్ అభిమానుల క్రేజ్ తెలుసుకోవడం కోసం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

ఇక జరగబోయే టి20 మ్యాచ్ లో ట్రయిల్ బ్లేజర్స్ జట్టుకి స్మ్రితి మందన నాయకత్వం వహిస్తుంది. ఇక సూపర్ నోవాస్ కి హార్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహిస్తుంది.

ఈ మ్యాచ్  లో మొత్తం 26మంది మహిళా క్రీడాకారులు పాల్గొననున్నారు. ఈ మ్యాచ్ క్రీడాకారుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు న్యూజిల్యాండ్ నుండి 1౦ మందికి పైగా ప్రపంచ క్రీడాకారులు పాల్గొనడం విశేషం.

క్రీడాకారుల వివరములు:

ఐపియల్ ట్రయిల్ బ్లేజర్స్ క్రీడాకారులు:

అలిస్సా హీలి (వికెట్ కీపర్), స్మ్రితి మందన (కెప్టెన్), సుజీ బేట్స్, దీప్తి శర్మ, బెత్ మూనీ, జేనీమా రోడ్రేగ్యూస్, డేనిఎల్లె హజ్జాల్, శిఖా పాండే, లియా తహూహ, జులాన్ గోస్వామి, ఏక్తా బిస్త్, పూనం యాదవ్, దాయాలన్ హేమలత.

ఐపియల్ సూపర్ నోవాస్ క్రీడాకారులు:

డేనిఎల్ వ్యాట్, మిథాలి రాజ్, మెగ లేన్నంగ్, హార్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), సోఫీ దేవినే, ఎల్య్సే పెర్రీ, వేదా కృష్ణమూర్తి, మొన మేశ్రం, పూజా వస్త్రాకర్, మేగాన్ స్కట్, రాజేశ్వరి గైక్వాడ్, అనుజా పాటిల్, తానియ భాటియా (వికెట్ కీపర్)

ఐపీఎల్ మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోయే రోజునే ఈ మహిళా ఐపీఎల్ కూడా జరగనుంది. ఆరోజు రాత్రి 8 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ కు చెన్నై సూపర్ కింగ్స్ కు మ్యాచ్ జరగనుంది.

ఈ మహిళా ఐపీఎల్ మ్యాచ్ మధ్యాహ్నం 2.30 నిమిషాలకు జరగనుంది. మరి పురుషుల ఐపీఎల్ మ్యాచ్ పొందినంత ఆదరణ స్త్రీల ఐపీఎల్ కి కూడా అందిస్తారో లేదో మన క్రికెట్ అభిమానులు.

మామాట: మహిళా టీ20 అభిమానులను అలరిస్తుందా?

Leave a Reply