బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్ లేని ఫ్రంట్ వ్యర్థం : శరద్ పవార్!

Share Icons:
  • థర్డ్ ఫ్రంట్ పై ఆలోచనలు పుకార్లే : పవార్
  • ఇప్పటికీ కాంగ్రెస్ బలమైన శక్తే
  • రాజకీయాల్లో కాంగ్రెస్ అవసరo ఉంది

బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ , ఫోర్త్ ఫ్రంట్ వార్తలు పుకార్లు షికార్లు చేస్తున్న నేపథ్యంలో  మూలబిందువుగా  ఉన్న సీనియర్ నేత , మరాఠా యోధుడు శరద్ పవార్ స్పందించారు…… కాంగ్రెస్ లేకుండా బీజేపీకి వ్యతిరేక ఫ్రంట్ సాధ్యం కాదని అలంటి ఫ్రంట్ ఏర్పాటు ఆలోచన వ్యర్థమని కుండబద్దలు కొట్టారు…. ఇటీవల ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన 8 పార్టీల సమావేశంపై ఆయన స్పందించారు….

దేశంలో బీజేపీని ఢీకొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ చేయూత ఎంతో అవసరమని చెప్పారు. బీజేపీని ఎదుర్కొనేందుకు ఏ ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేసినా, కాంగ్రెస్ ను విస్మరించలేమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లేని ఫ్రంట్ తో ఉపయోగంలేదని తేల్చి చెప్పారు. ఇప్పటికీ కాంగ్రెస్ దేశంలో బలమైన శక్తే. రాజకీయాల్లో కాంగ్రెస్ అవసరం ఎంతైనా ఉంది అని ఆయన ఉద్ఘాటించారు.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply