తెలంగాణ ఎన్నికలు: ఆ 4 రోజులు మద్యం షాపులు బంద్..

Share Icons:

హైదరాబాద్, 10 నవంబర్:

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో మందుబాబులకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎన్నికలు జరిగే డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు మద్యం షాపులు మూతపడనున్నాయి. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్ర శాసనసభకి డిసెంబర్ 7న ఎన్నికలు జరగనుండగా… 11వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో 5వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు షాపులు మూత పడనున్నాయి. ఇక ఆతర్వాత  ఓట్ల లెక్కింపు రోజునా అనగా డిసెంబర్ 11వ తేదీన కూడా షాపులు బంద్ కానున్నాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

మామాట: సరైనా రోజుల్లోనే బంద్ చేస్తున్నారుగా… 

Leave a Reply