ఫోక్సో సవరణతో బాలికలపై అత్యాచారాలు ఆగుతాయా?

Share Icons:

న్యూఢిల్లీ ఏప్రిల్ 24:

ఫోక్సో చట్ట సవరణ తరువాత నిజంగా నిందితుల్లో మార్పు వస్తుందా? బాలికలపై అత్యాచారాలు తగ్గుతాయా? నేర ప్రవృత్తి తక్కువవుతుందా..? చట్ట సవరణ వలన ఉపయోగం ఉంటుందా?  మరణశిక్ష సరియైన మార్గమా? అనే అంశాలపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. బాలికపై అత్యాచారం ఫోక్సో చట్టంలో మార్పులను అధికారులు ప్రతిపాదించడం, కేంద్ర కేబినెట్ ఆమోదించడం ఆపై రాష్ట్రపతి రాజ ముద్ర వేయడం వెను వెంటనే జరిగిపోయాయి.

కథువా సంఘటన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నిరసనలు వ్యక్తమైన విషయం తెలిసిందే భారత దేశ పరువు ప్రతిష్ట దిగజారిన విషయం కూడా వాస్తవమే. వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగానే ఫోక్సో చట్టాన్ని సవరించింది. పన్నెండేళ్ల లోపు బాలికలపై అత్యాచారం జరిపితే నిర్ధారణ అయిన వెంటనే ఆ వ్యక్తికి మరణశిక్ష వరకు విధించే అవకాశముంది.

Banker Loses Job After Comment On Kathua Rape Caseఈ చట్టంపై పలు రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు కేంద్ర నిర్ణయాన్ని బాహాటంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఉరిశిక్షలు వేస్తే అత్యాచారాలు ఆగుతాయా? ఆర్డినెన్స్‌ జారీ చేయడానికి ముందు కేంద్రం శాస్త్రీయ అధ్యయనం చేసిందా? అత్యాచారానికి, హత్యకు శిక్ష ఒకటే అయినప్పుడు, రేప్‌ చేసిన నిందితుడు బాధితురాలిని బతకనిస్తాడా?’’ అని జస్టిస్‌ గీతా మిట్టల్‌, జస్టిస్‌ హరిశంకర్‌లతో కూడిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.

‘అత్యాచార ఉదంతాలకు సంబంధించి గతంలో చేసిన ఐపీసీ చట్టసవరణ దుర్వినియోగం అవుతోందం’టూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఇవి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

నిర్భయ చట్టం తర్వాత మార్పులు వచ్చాయా?

కథువా,ఉన్నావ్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం, ఉన్నావ్‌లో బాధితురాలి తండ్రి హత్య ఘటనలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. అలాగే వివిధ దేశాల్లో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి.  ఈ దరిమిలా కేంద్రం పోక్సో చట్టానికి సవరణలు చేసింది. 12 ఏళ్లలోపు బాలికలపై అత్యాచారం జరిపితే ఖచ్చితంగా మరణశిక్ష విధించాలన్నది ఆ సవరణ ఉద్దేశం.కానీ, ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే, గతంలో వచ్చిన ‘నిర్భయ’ చట్టం ఎంతవరకు సత్ఫలితాలను ఇచ్చింది.?

ఎన్ని సంఘటనలను నిరోధించగలిగింది? అనే అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంఎంతైనా ఉంది. నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా అత్యాచారాలు దేశంలో చాలా చోట్ల నమోదయ్యాయి.  నేరాలు అంతగా తగ్గాయనడానికి పెద్ద ఉదాహరణలు లేవు.  వాస్తవం చెప్పాలంటే నిర్భయ చట్టం చాలా కఠినమైన చట్టం. ఆ తర్వాత కూడా నేరాల సంఖ్య తగ్గలేదు అనే అంశం నేర పరిశోధన రికార్డులే  చెబుతున్నాయి.

3 years girl raped by 45 years bus cleaner2016 నాటి జాతీయ క్రైం రికార్డుల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం మహిళలపై అత్యాచారాలు, ఇతర లైంగిక నేరాలు అంతక్రితం కంటే 2.9 శాతం పెరిగాయి. బాలికలపై లైంగిక నేరాలు సైతం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదిక తెల్పింది. 2015తో పోలిస్తే 2016లో ఈ తరహా నేరాలు 82 శాతం ఎక్కువయ్యాయని వివరించింది. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడుల్లో ఈ కేసులు అత్యధికంగా జరిగాయని పేర్కొంది. మెట్రో నగరాల్లో ఈ బెడద ఎక్కువని తెలిపింది. మరోపక్క పోక్సో కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానాలున్నా అవి నత్తనడకన సాగుతున్నాయని తేల్చింది. ఇలాంటి స్థితిలో చట్ట సవరణ అవసరమా? ఆర్డినెన్స్ ఆవశ్యకత ఎంతవరకు ఉంది తర్వాత కూడా మార్పు వస్తుందని నమ్మకం ఉందా? అనే ప్రశ్నలు సామాజికవేత్త నుంచి వెలుగు చూస్తున్నాయి.

చట్ట సవరణలకంటే సామాజిక మార్పులను తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని వారు భావిస్తున్నారు. అదే సమయంలో నేరాలు వాటి మూలాల్లోకి కూడా వెళ్లి పరిశీలన జరపాల్సి ఉంటుందని వారు గుర్తుచేస్తున్నారు.

మామాట : కీలెరిగి వాత పెట్టాలి. అప్పుడే జబ్బు నయం అవుతుంది

English summary:

Court asked government is there any research before making ordinance on Pocto law..  so many NGOs ryzen is there any guarantee after making a ordinance in pocto law. but also court point out that is there any guarantee refs will not be happened after this law amendment?. 

Leave a Reply