రాఫెల్ డీల్: సుప్రీం కోర్టుకు అబద్దాలు చెప్పారు…

Share Icons:

ఢిల్లీ, 15 డిసెంబర్:

రాఫెల్ డీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించిందని పీఏసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు.ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్ డీల్‌కు సంబంధించిన వివరాలేవీ ‘కాగ్’కు, దాని ద్వారా పీఏసీకి చేరలేదని అన్నారు.

ఇక  అటార్నీ జనరల్, ‘కాగ్’ కు సమన్లు పంపించే విషయమై పార్లమెంట్ లోని పీఏసీ సభ్యులతో చర్చిస్తానని చెప్పారు. కాగ్ ద్వారా తప్పుడు వివరాలను సుప్రీంకోర్టుకు ఇచ్చినందుకుగాను ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సుప్రీం తీర్పును గౌరవిస్తాం కానీ, రాఫెల్ డీల్ పై తప్పనిసరిగా జేపీసీ వేయాల్సిందేనని, పార్లమెంట్ లో ‘కాగ్’ ఇచ్చిన నివేదికను ప్రవేశపెట్టారనే దానిపై అటార్నీ జనరల్, కాగ్ సమాధానం ఇవ్వాలని అన్నారు. ఈ మేరకు పీఏసీ సభ్యులతో మాట్లాడి వారికి సమన్లు పంపిస్తామని ఖర్గే స్పష్టం చేశారు. అలాగే కాగ్’ ఇచ్చిన నివేదికను పీఏసీ ఎప్పుడు పరిశీలించింది? ఆ నివేదికను పార్లమెంట్ ఎదుట ఎప్పుడు ఉంచారు? అని ప్రశ్నించారు. 

మామాట: మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే ఇదంతా ఉండదుగా

Leave a Reply