భర్తని సుత్తితో కొట్టి చంపిన భార్య..ఎందుకంటే?

wife kills husband or-extra-marital-affair
Share Icons:

విశాఖపట్నం, 13 ఆగష్టు:

అక్రమ సంబంధాన్ని నిలదీస్తున్నాడనే కోపంతో కట్టుకున్న భర్తనే సుత్తితో కొట్టి చంపేసిందో ఓ భార్య. ఇక ఈ విషయం  తెలియకుండా తన భర్తది సహజ మరణమేనని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ మృతుడి కుటుంబానికి అనుమానం వచ్చి పోలీసులకి ఫిర్యాదు చేయడంతో  అసలు విషయం బయటపడింది. దీంతో తానే హత్య చేసినట్టు నిందితురాలు ఒప్పుకొంది. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది.

ఈ ఘటనకి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే…జిల్లాలోని కశింకోటకు చెందిన ఓ 17 ఏళ్ల బాలికకు, అనకాపల్లి గవరపాలెంలో ఉండే తాపీ మేస్త్రీ నక్కా నూకేశ్వరరావుకి మూడేళ్ల క్రితం పెళ్లైయ్యింది. చిన్నవయసులో తాపీ మేస్త్రీని వివాహం చేసుకోవడం ఆ బాలికకు అస్సలు ఇష్టం లేదు. దాంతో తనకు బాగా నచ్చిన మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో ఓ రోజు వేరే అతనితో గడుపుతూ అడ్డంగా దొరికిపోవడంతో ఆమెను భర్త నూకేశ్వరరావు బుద్దిగా ఉండాలని మందలించాడు.

ఇక ఈ విషయంలో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఆ సమయంలోనే సహనం కోల్పోయిన ఆమె, సుత్తితో భర్త తల మీద బలంగా బాదింది. ఆ దెబ్బకి నూకేశ్వరరావు తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. కానీ హత్య విషయం తెలియకుండా, భర్త శరీరంపై పసుపు రాసి, సాధారణ మరణంగా నమ్మించే ప్రయత్నం చేసి, దహన సంస్కారాలు చేసేందుకు అన్నీ సిద్ధం చేసింది. అయితే నూకేశ్వరరావు ఒంటి మీద గాయాలు ఉండడం చూసి, అనుమానం వచ్చిన అతని అక్క పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు, బాలికను నిలదీయడంతో అసలు విషయం బయటికి వచ్చింది. భర్తని తానే హత్య చేసినట్లు ఒప్పుకుంది.

మామాట: దారితప్పుతున్న వివాహ బంధాలు….

Leave a Reply