తెల్లవారేసరికి కాలి బూడిదైన ముగ్గురు పిల్లల తల్లి 

Share Icons:
ఏలూరు,సెప్టెంబర్ 10 ,
పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజు పాలెం  గ్రామం లో దారుణం జరిగింది. ఆదివారం  రాత్రి జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. స్థానికంగా ఎస్సీ పేటలో ఉండే బొబ్బిలి రామారావుతో ప్రణితకు వివాహమైంది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. పెద్ద కుమార్తె తెలంగాణలో ఒక పాఠశాలలో టీచరుగా పనిచేస్తోంది. మిగిలిన ఇద్దరు పిల్లలు స్థానికంగా చదువుకుంటున్నారు. గత కొద్ది రోజుల క్రితమే దుబాయిలో పనిచేసి తిరిగి వచ్చింది ప్రణిత. అప్పటినుంచి భార్యాభర్తలు మధ్య తరచూ గొడవలు జరిగేవని స్థానికులు చెబుతున్నారు. ఆదివారం రాత్రి ప్రణిత పూర్తిగా కాలిన గాయాలతో మరణించింది. ఆమె  మరణానికి భార్య భర్తల గొడవలే కారణం.  అయినప్పటికీ రాత్రి  తెల్లవారుజామున జరిగిన ఘటనలో భర్త ప్రవర్తనపై పలు అనుమానాలు వ్యక్త మౌతున్నాయని స్తానికులు అంటున్నారు.  “కిరోసిన్ పోసుకుని నిప్పు పెట్టుకుని ఆత్మహత్య చేసుకుందా? లేక భర్తే హత్య చేసి నిప్పు పెట్టడా?”అని అనుమానిస్తున్నారు.
మామాట:  చట్టాలెన్ని ఉన్నా, మహిళలపై ఘోరాలు జరుగుతూనే ఉన్నాయ్…

Leave a Reply