పదవి దక్కిన పయ్యావుల సైలెంట్ గా ఎందుకు ఉన్నారో?

why tdp mla payyavula keshav silent after select pac chairman
Share Icons:

అమరావతి: పయ్యావుల కేశవ్…టీడీపీ సీనియర్ నేత..నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాయకుడు. అయితే పయ్యావుల ఎమ్మెల్యేగా గెలిస్తే తెలుగుదేశం పార్టీ అధికారంలో అసలు ఉండదు. 1994 మినహా, 2004, 2009, 2019 ఎన్నికల్లో పయ్యావుల ఉరవకొండ నుంచి ఎమ్మెల్యే గా గెలిచిన టీడీపీ మాత్రం ప్రతిపక్షానికే పరిమితమైంది. 2014లో టీడీపీ అధికారం ఉన్నప్పుడూ పయ్యావుల ఓటమి పాలయ్యారు.

అయితే మళ్ళీ మొన్న ఎన్నికల్లో పయ్యావుల గెలిస్తే టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. దీంతో కాస్తా పయ్యావుల సైలెంట్ అయిపోయారు. అసెంబ్లీలో కూడా అప్పుడప్పుడు మాట్లాడారే తప్ప ఎక్కువ స్థాయిలో కాదు. అయితే పయ్యావులకు ఉన్న అనుభవం, వాక్చాతుర్యం దృష్ట్యా ప్రతిపక్ష ఎమ్మెల్యేకు దక్కే కీలకమైన ప్రజా పద్దు కమిటీ ఛైర్మన్ పదవి  అప్పగించారు.

ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ అనేది రాజ్యాంగ బద్దమైన పదవి. కేబినెట్ హోదా ఉంటుంది. ఇది ప్రతిపక్షంలో ఉండే ఓ ఎమ్మెల్యేకి దక్కుతుంది. అలాంటి పదవి కోసం టీడీపీలో చాలామంది నేతలు పోటీపడిన చంద్రబాబు మాత్రం ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు కట్టబెట్టారు.

అయితే పదవి దక్కిన పయ్యావుల సైలెంట్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవైపు చంద్రబాబు, ఇతర నేతలు వైసీపీ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్నారు. పోలవరంలో రివర్స్ టెండరింగ్ కు వెళ్ళడం గానీ, బందరు పోర్టు కాంట్రాక్ట్ రద్దు గానీ తదితర అంశాలపై జగన్ ప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. ఇలాంటి సమయంలో పదవి ఉండి కూడా  పయ్యావుల సైలెంట్ ఉన్నారు. అసలు ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ అంటే ప్ర‌భుత్వం చేసే ఖ‌ర్చులు, వివిధ ప్రాజెక్టుల వివ‌రాలు, బ‌డ్జెట్ కేటాయింపుల‌పై నిశితంగా ప‌రిశీల‌న చేసి త‌ప్పు ఒప్పుల‌ను ఎంచే అత్యంత కీల‌క‌మైన ప‌ద‌వి. అలాంటి పదవి చేతిలో పెట్టుకుని పయ్యావుల ఏం చేయలేకపోతున్నారు.

అయితే పయ్యావుల సైలెంట్ గా ఉండిపోవడానికి పెద్ద కారణమే ఉందని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రజా పద్దుల కమిటీ ఛైర్మ‌న్‌ను నియమించినా…కీల‌క‌మైన స‌భ్యుల‌ను ఇప్ప‌టికీ ప్ర‌క‌టించ‌లేదు. దీంతో ఆయ‌న ఏమీ చేయ‌లేక పోతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

కాకపోతే ఈ విషయంపై ప‌య్యావుల చొర‌వ తీసుకుని ప్ర‌జాప‌ద్దుల క‌మిటీని ఏర్పాటు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయొచ్చు. అవసరమైతే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి కమిటీ ఏర్పాటుకు కృషి చేయొచ్చు.  కానీ అలాంటి ప్రయత్నాలు ఏవి పయ్యావుల చేసినట్లు కనపడలేదు. మరి చూడాలి పయ్యావుల రానున్న రోజుల్లో అయిన ఛైర్మన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ వైసీపీని ఇరుకున పెడతారేమో. పయ్యావుల ఎప్పటికీ యాక్టివ్ అవుతారో వేచి చూడాలి.

Leave a Reply