వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Share Icons:
కొత్త ఢిల్లీ ఆగష్టు 27 ,
సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఇండియాలో ఇప్పటి వరకు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. వాట్సాప్‌తోపాటు కేంద్ర సమాచార, ఆర్థిక శాఖలకు కూడా ఈ నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టంచేసింది. నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేయడానికి కేంద్రం వివిధ చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా అసలు సదరు నకిలీ వార్త ఎక్కడి నుంచి మొదలైందో తెలుసుకునేలా ఓ వ్యవస్థ రూపొందించాలని వాట్సాప్‌ను కేంద్రం ఆదేశించింది.
అయితే ఇది యూజర్ల గోప్యతకు భంగం కలిగించినట్లు అవుతుందంటూ వాట్సాప్ అందుకు నిరాకరించింది. నకిలీ వార్తలపై యూజర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం మాత్రం చేస్తామని చెప్పింది. ఈ అంశంపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు.. అసలు ఫిర్యాదులు స్వీకరించే అధికారిని ఎందుకు నియమించలేదంటూ నిలదీసింది.
మామాట:  అంతే, అంతే, అన్నీ కోర్టే చెప్పాలి… 

Leave a Reply