రైలులో నచ్చిన సీటు కావాలా..? అయితే ఈ లాజిక్ తెలుసుకోవాల్సిందే ..!

Share Icons:

హైదరాబాద్, 1ఫిబ్రవరి:

బస్సు ప్రయాణం అంటే  ఇబ్బంది పడేవారుంటారు, కానీ రైలు ప్రయాణమంటే ఎగిరి గంతేయని వారుండరు..

చిన్నప్పుడైతే రైలులో కిటికి పక్కసీటు వస్తే బాగుండని అనుకుంటాం..ఇప్పటికీ కూడా కిటికీ సీటు కావాలనుకునే వారు చాలా మంది ఉంటారు. నిద్రప్రియులైతే అప్పర్ బెర్త్ వస్తే హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంటారు.

మనం బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు విండో సీటు కావాలా… ! ముందు వరసలో సీటు కావాలా… ! లేక మద్యలో సీటు కావాలా.. అసలు ఏ సీటు కావాలంటే ఆ సీటును మనం ఎంపిక చేసుకుంటాం.

అదే రైలు విషయానికి వస్తే అలా కుదరదు. మనం ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి వెళ్లినప్పుడు సిబ్బంది ఏ సీట్ కేటాయిస్తే అదే తీసుకోవాలి. ఎందుకిలా..? అసలు రైలు లో సీటు ఎలా కేటాయిస్తారో తెలుసా..? కానీ ఈ సీట్ల కేటాయింపు వెనుక లాజిక్ ఉందని తెలుసా…!

మొదటగా బుక్ చేసుకునే వ్యక్తికి మధ్య భాగంలో అంటే ఎస్5 బోగీలో సాఫ్ట్‌వేర్ సీట్‌ని కేటాయిస్తుంది. కోచ్‌లోనూ మిడిల్‌ సీటు నుంచి టిక్కెట్లను బుక్‌చేస్తుంది. అంటే 72 సీట్లుంటే 36వ సీటును కేటాయిస్తుంది. ఇక చివరగా బుక్‌చేసుకునే వ్యక్తికి ఎస్‌1 లేదా ఎస్‌ 10 బోగీలో సీటును బుక్‌చేస్తుంది.

బెర్త్‌ విషయంలోనూ మొదటగా లోయర్‌ బెర్త్‌, ఆ తర్వాత మిడిల్‌ బెర్త్‌, చివరకు అప్పర్‌బెర్త్‌ను కేటాయిస్తుంది. అలాకాకుండా ఒక క్రమపద్ధతి లేకుండా టికెట్‌లను కేటాయిస్తే.. కొన్ని బోగీలు పూర్తిగా నిండిపోయి, మరికొన్ని ఖాళీగా ఉండే అవకాశముంది.

ఇలాంటి సమయాల్లో ములుపుల దగ్గర రైలు పడిపోయే ప్రమాదముంది. కొన్ని బోగీలపై ఎక్కువ భారముంటే, మరికొన్నింటిపై తక్కువగా ఉంటుంది. ఫలితంగా రైలు పట్టాలు తప్పుతుంది.

అందుకే రైలు ప్రమాదంబారిన పడకుండా ఉండేందుకు… భద్రతా చర్యల్లో భాగంగానే సీట్ల కేటాయింపును ఒక క్రమపద్దతిలో చేస్తారు.

మామాట:  జరిగే ప్రమాదాలను అరికట్టడానికి ఓ పద్దతి కనుగొంటే…

English Summary: 

Allotment of train seats is a process of work in which we don’t get seats what we like to get.

Leave a Reply