TRENDING NOW

సెంట్రల్‌లో కింగ్ ఎవరో?

సెంట్రల్‌లో కింగ్ ఎవరో?

విజయవాడ, 16 మార్చి:

2009 జరిగిన ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరుపున మల్లాది విష్ణు ఇక్కడ నుండి విజయం సాధించారు.  అలాగే 2014 ఎన్నికల్లో బొండా ఉమా 30 వేలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. అయితే ఈసారి సెంట్రల్‌లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.  ఈ సారి ఎన్నికల్లో ఉమానే మళ్ళీ టీడీపీ నుండి పోటీ చేస్తుండగా, వైసీపీ నుండి సీనియర్ నేత మల్లాది విష్ణు బరిలో ఉన్నారు.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

ఇక గత అయిదేళ్లుగా కాలంలో ఉమాపై ప్ర‌జ‌ల‌ను చుల‌క‌న‌గా చూడ‌డం, భూ క‌బ్జాలు లాంటి ఆరోప‌ణ‌లు బాగానే ఉన్నాయి. కాకపోతే టీడీపీలో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు పొంద‌డం….సెంట్రల్‌లో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలయ్యేలా చేయడం వంటివి బొండాకి కలిసిరానున్నాయి. సెంట్రల్‌లో గట్టి పట్టు ఉన్న వంగవీటి రాధా టీడీపీలో చేరడం కలిసొచ్చే అంశం.

మరోవైపు సెంట్రల్ నుండి బరిలోకి దిగుతున్న విష్ణుకి కాంగ్రెస్‌లో ఉన్నప్పటి నుండి నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. అలాగే విష్ణు సామాజికవర్గం వారు కూడా ఇక్కడ బాగానే ఉన్నారు. అలాగే టీడీపీ మీద వ్యతిరేకిత తనకి కలిసొస్తుందని మల్లాది భావిస్తున్నారు. అటు విజయవాడ సెంట్రల్ నుండి జనసేన జనసేన నుంచి బొండా ఉమ బంధువు కోగంటి సత్యం రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి.

కాగా, నియోజకవర్గంలో బీసీలు, ఎస్సీలు అధికం. కాపు సామాజికవర్గం కూడా గణనీయంగా ఉంది. బ్రాహ్మణుల ఓట్లు కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఏది ఏమైనా బొండా, మల్లాదిల మధ్యే ప్రధాన పోరు జరగనుంది.

మామాట: ప్రజలు కొన్ని రోజుల్లో తేల్చేస్తారు కింగ్ ఎవరో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: