మందుబాబులూ మీ లెక్కలు చూసుకోండి…

who released alcohol addicts in the world
Share Icons:

హైదరాబాద్, 23 సెప్టెంబర్:

‘మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం మరియు ప్రాణాంతకం’ అంటూ నిత్యం ఎన్నో ప్రకటనల్లో చూస్తూనే ఉంటాం. రోజూ మందు తాగి చావకురా అని ఇంట్లో పెద్దవాళ్ళు తిడుతూ ఉంటే వింటూనే ఉంటాం. కానీ, మందుబాబులు మాత్రం మందు తాగడం మానేస్తున్నారా..?

రోజూ నిద్ర లేవగానే మందుతోనే తమ రోజుని మొదలు పెట్టే వాళ్ళు ఎందరో ఉన్నారు. అలాగే రాత్రి మందు కొడితే గానీ నిద్ర పోని వాళ్ళ గురించి చెప్పాలంటే లెక్కే ఉండదు. ఇక ఈ మధ్యలో పగలంతా తప్ప తాగి రోడ్ల మీద పడి దొర్లే వాళ్ళ సంగతి ప్రత్యేకంగా చెప్పుకునేదేముంది. ఒక్కరోజు మందు దొరకకపోయినా, తాగగకపోయినా పిచ్చెక్కి తిరిగే మందుబాబులు ఎందరో.. అందుకే మద్యం దుకాణాలు బంద్ అనో.. సెలవు అనో ముందే తెలిస్తే ముందు రోజు రాత్రే మరుసటి రోజుకి కావలసిన మందు సమకూర్చుకుంటారు.

అయితే ఇలా తాగడం వలన వారికి గానీ వారి కుటుంబానికి గానీ ఏదైనా లాభం ఉంటుందా అంటే పైసా కూడా ఉండదు. పైగా రోజూ తాగి ఇంట్లో గొడవలు, డబ్బు వృధాగా పోవడం దానితో పాటు అదనంగా ఆరోగ్యం పాడయ్యి కాన్సర్ లాంటి మహమ్మారిల బారిన పడడం, చివరికి ప్రాణాలు పోగొట్టుకోవడం.

కేవలం తమ ప్రాణాలే పోగొట్టుకుంటున్నారా అంటే కాదే.. తప్పతాగి రోడ్లపై బండి నడుపుతూ రోడ్డు మీద కనిపించనవారిని గుద్ది చంపుతున్నారు. లేదా మద్యం మైకంలో చిన్న గొడవని సైతం పెద్దగా చేస్తూ ఇంట్లో భార్యా బిడ్డల్నో, అన్నదమ్ముల్నో, తల్లితండ్రుల్నో నిర్ధాక్షిణ్యంగా చంపేస్తున్నారు.

ఇక ఈ మందుబాబుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) నిర్వహించిన సర్వేలో బయటపడ్డ నిజాలు చూస్తే ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా మందు అంటే భయం వేస్తుంది. ఇంతకీ ఆ సంస్థ చెబుతున్న నిజలేమితో ఇప్పుడు చూద్దాం..

మందుబాబులూ మీ లెక్కలు చూడండి…

Image result for alcohol drinkers
ఫుల్‌గా మద్యం సేవించడం వల్ల ప్రపంచవ్యాప్తంగా 2016లో ఏకంగా 30 లక్షల మంది చనిపోయినట్లు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 230 కోట్ల మంది మద్యం తాగుడుకి అలవాటు పడ్డారని, వీరిలో 23.7 కోట్ల మంది పురుషులు, 4.6 కోట్ల మంది స్త్రీలు దానికి బానిసలై ఇబ్బంది పడుతున్నారని వెల్లడించింది. ఇక మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవడం, లేదా వాహనాలు నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని చెప్పింది.

ఇలా మద్యానికి బానిసై ఇబ్బంది పడుతున్న వారిలో అమెరికా, యూరప్ ప్రజలు గణనీయంగా ఉన్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అలాగే మద్యం సేవించేవారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు జీర్ణక్రియ సరిగ్గా పనిచేయకపోవడం, కేన్సర్, మానసికస్థితి సరిగా లేకపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు వెల్లడించింది. ఈ వ్యసనాన్ని తక్షణం నివారించే అవసరం ఉందని డబ్ల్యూహెచ్‌వో అభిప్రాయపడింది.

మామాట: మందుబాబులూ…జరభద్రం….

Leave a Reply