సీఎల్పీ లీడర్ ఎవరో?

Share Icons:

హైదరాబాద్, 13 డిసెంబర్:

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కేవలం 19 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్ష పాత్ర పోషించనుంది. అయితే ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త సమస్య ఒకటోచ్చింది.

జానారెడ్డి సహ పలువురు సీనియర్ నేతలు ఓటమి పాలవ్వడంతో…అసెంబ్లీలో సీఎల్పీ లీడర్ పదవిని ఎవరికి ఇవ్వాలనే దానిపై యోచనలో పడింది. ప్రస్తుతం గెలిచిన 19 మంది ఎమ్మెల్యేలలో ఉత్తమ్ కుమార్, భట్టి విక్రమార్క, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి మాత్రమే సీనియర్లు ఉన్నారు. ఇక వీరిలో సీఎల్పీ పదవి ఎవరికి దక్కుతుందో ఆసక్తికరంగా మారింది.  

అయితే పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డికి సీఎల్పీ పదవి దక్కే అవకాశం లేకపోవచ్చు. ఇక ఉమ్మడి ఏపీ రాష్ట్ర శాసనసభకు డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన మల్లు భట్టి విక్రమార్కని సీఎల్పీ నేతగా ఎన్నుకొనే అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం. భట్టి తర్వాత, సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబులకి అవకాశం కొంత వరకు ఉంది. .

మరో వైపు టీపీసీసీ ప్రెసిడెంట్ రేసులోనూ భట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. అదలావుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎల్పీ లీడర్ గా చేసి.. టీపీసీసీ కి అధ్యక్షుడిగా భట్టి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

మామాట: మరి అధిష్టానం సీఎల్పీ పదవిని ఎవరికి కట్టబెడుతుందో

 

Leave a Reply