ఎన్టీఆర్ సినిమాలో బాలయ్య పాత్ర ఎవరు వేస్తారు…?

Share Icons:

విజయవాడ, డిసెంబర్ 27: 

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ‘యన్.టి.ఆర్’ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను ఆయన కుమారుడైన నందమూరి బాలకృష్ణ నటిస్తుండగా.. హరికృష్ణ పాత్రలో ఆయన కుమారుడు కళ్యాణ్ రామ్ నటిస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో దగ్గుబాటి రాణా నటిస్తుండగా ఇతరాత్ర కీలక పాత్రలో టాలీవుడ్‌లోని ప్రముఖ నటీనటులంతా నటిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా ప్రధాన పాత్ర పోషిస్తున్న బాలయ్య పాత్రలో ఎవరు నటించబోతున్నారనేదే ఇంకా తెలియరాలేదు.

ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా బాలకృష్ణ తనయుడు మోక్షాజ్ఞ పలుసార్లు సెట్‌లోకి వెళ్లి వచ్చాడు. అయితే, అతను ఈ సినిమాలో నటించలేదని చిత్ర యూనిట్ చెబుతోంది. తాజాగా విడుదలైన చిత్రంలోని ప్రధాన పాత్రల జాబితాలో కూడా బాలకృష్ణ పాత్రను ఎవరు పోషిస్తున్నారనేది లేకపోవడం గమనార్హం. ఎన్టీఆర్ సినిమాలో ఆయన కుటుంబ సభ్యులంతా దాదాపుగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణ కూడా కనిపించాల్సి ఉంటుంది. పైగా బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్‌తో కలిసి పలు పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు.

ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టిన బాలకృష్ణ, దర్శకుడు క్రిష్‌ల దృష్టంతా ‘ఎన్టీఆర్’ పాత్రపైనే ఉందని, ఈ నేపథ్యంలో బాలకృష్ణ పాత్రను జూనియర్ ఆర్టిస్టులతో పూర్తి చేశారని తెలుస్తోంది. సావిత్రి బయోపిక్‌ ‘మహానటి’ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర తరహాలో బాలయ్య పాత్రను చిత్రించినట్లు సమాచారం. అయితే, బాలకృష్ణ పాత్రను బాలకృష్ణే స్వయంగా పోషించారని, అటు ఎన్టీఆర్‌గా.. ఇటు బాలయ్యగా ఆయన ద్విపాత్రభినయం చేశారని మరికొందరు చెబుతున్నారు.

మామాట: మరి బాలయ్య పాత్ర ఉందో లేదో

Leave a Reply