ఎవరు బాధ్యులు- ఎవరు బాధితులు?

Who is responsible - who are the victims?-CEC-AP,Elections
Share Icons:

తిరుపతి, ఏప్రిల్ 12,

ప్రజాస్వామ్యానికి ఎన్నికలు వెన్నెముఖవంటివి. అందులో పారదర్శక ఎన్నికలు ప్రాణవాయువు వెటివి. తమ పాలకులు ఏవరో ప్రజలే నిర్ణయించుకోవడం గొప్ప విధానం. దానికి మూల సూత్రం నిష్పాక్షిక ఎన్నికలు. కానీ ఇటీవల మన దేశంలో చాలా స్వతంత్ర సంస్థల పనితీరులో వస్తున్న మార్పులు, నీరుగారుతున్న వ్యవస్థల ధోరణి చివరికి ఎన్నికల సంఘానికి కూడా పాకింది.

ఐదు సంవత్సరాలకు ఒక సారి ఎన్నికలు కూడా నిర్వహించలేని రాష్ట్ర ఎన్నికల సంఘం తీరు దేనికి ప్రతీక. ఓటర్లజాబితాలో అవకతవకలకు ఎవరు బాధ్యులు. 2004 నుంచీ ఒకే చిరునామాలో.. అదీ స్వంత ఇంట్లో ఉంటున్నవారికి కూడా ఈ ఎన్నికల్లో ఓటు వేసే అవకాసం లేకపోతే అది ఎవరి తప్పిదం.. దానికి మూల్యం చెల్లిస్తున్నది ఎవరు. తప్పుడు ఓటర్ల జాబితా సిద్దం చేసిన ఎన్నికల అధికారులకు  శిక్ష లేదా. 

ఇట్లా తూతూ మంత్రంగా ఎన్నికలు నిర్వహించడం దేనికి. లాటరీ వేసి ఎవరి పేరు వస్తే వారినే పరిపాలించమంటే పోతుంది కదా. ఎన్నికల పేరిట ఆడిట్ కూడా లేకుండా ఓన్నికల సంఘం ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. వీటికి లెక్కలున్నాయా. అది ప్రజలడబ్బు, పన్నుల రూపంలో వచ్చిన సొమ్మే కదా. వీటన్నిటికీ జవాబుదారీతనం లేదా.  

ఏం జరిగినా ఎవరూ ఏమీ అనరు. ఎవరికీ సమాధానం చెప్పవలసిన పని లేదు అనే భావన ప్రజాస్వామ్యంలో పనికిరాదు. ఎన్నికల సంఘం కూడా ప్రజలకు బాధ్యత వహించాలి. అసంపూర్తిగా ఉన్న, తప్పుడు ఓటరు జాబితాను రూపొందించేవారికి ఖచ్చితంగా కఠిన శిక్షలుండాలి. ఓటు ఉందో లేదో సరిచూసుకోండి అనేసి వెళ్లిపోవడం కాదు. పౌరులకు మాత్రమే బాధ్యత ఉంటుందా. అధికారలుకు ఉండవద్దా. వారు చాలా పెద్ద మొత్తంలో జీత భత్యాలు పన్నుల నుండే తీసుకుంటున్నారుకదా. దీనిపై మేధావులు దేశవ్యాప్తంగా చర్చ చేయాలి.

ఓటర్ల జాబితా లోపరహింతంగా రూపొందించే ప్రక్రియ తయారుచేసుకోవాలి. ఇంత సాంకేతిక ప్రగతి సాధించిన కాలంలోకూడా  పాడైన ఈవీఎం ల స్థానంలో కొత్తది పెట్టడానికి 6-7 గంటల సమయం పడుతోందంటే ఏమనాలి. పోలింగ్ సిబ్బందికి ఎందుకు తగిన శిక్షణ ఇవ్వలేదు. సిబ్బంది నిర్లక్షణికి బాధ్యత ఎవరిది. పోలింగ్ సిబ్బంది తప్పిదాలకు సారీ అంటే సరిపోతుందా. ఈసీ అధికారులకు ఏమి పోతుంది. ఏ ప్రభుత్వం వచ్చినా వారి జీతాలు, వారి భత్యాలు, పెన్షన్ వంటివి వారికి నిరాటంకంగా అందుతాయి. అందువలన వారికి ఎన్నికలు ప్రధానంకాకపోవచ్చుగానీ, ప్రజలకు నచ్చిన పాలకులను ఎన్నుకునే హక్కు కోల్పోవడం దారుణ మైన అవమానం.

రాజ్యాంగం పౌరులందరికీ సమానంగా కల్పించిన హక్కును కొందరు నిర్లక్ష పరులైన ఉద్యోగుల కారణంగా ప్రజలు కోల్పోవడం ఆలోచించ వలసిన విషయం. లేపం లేకుండా ఉండేంత వరకూ మళ్లీ మళ్లీ పోలింగ్ నిర్వహించడం వంటి శిక్ష అధికారులకు వేయాలి. అసలు ప్రత్యేకంగా ఓటరు జాబితా ఎందుకు. ఆధార్ కార్డులో వయసు నమోదై ఉంటుంది కదా, ఓటు హక్కు కలిగిన  వారందరికి ఆధార్ ఆధారంగా ఓటు వేసే వెసులుబాటు కల్పించాలి. అలాగే ఎవరు ఎక్కడనుంచైనా ఓటు వేసే వీలు ఉండాలి.

ఒక ఆధార్ నెంబర్ తో ఒక సారి ఓటు వేసిన తరువాత మరో సారి ఓటు వేసే వీలు ఉండదు కదా.  అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు. ఎక్కడ నుంచైనా ఓటు వేసే వీలుంటే ఈ పోలింగ్ కేంద్రాల నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. సెల్ ఫోన్ నుంచి, ఇంటర్నెట్ నుంచి, మొబైల్ పోలింగ్ కేంద్రాల నుంచి, మీ సేవా కేంద్రాల నుంచి ఎక్కడ నుంచైనా ఓటు వేసేలా మార్పులు చేయగలిగితే, ఈవీఎం ల భారం కూడా ఉండదు కదా..  మన శాస్త్రవిజ్ఞానం ఆకాశంలోకి ఉపగ్రహాలను పంపడానికే కాకుండా ఇటువంటి ప్రజాస్వామ్య మూల సూత్రాల పరిరక్షణకు ఉపయోగిస్తే మంచిదేమో ఆలోచించగలరు.

 

మామాట: ఎన్నికలు లోపరహితంగా నిర్వహించలేరా..

Leave a Reply