భార్యా భర్తల బాక్సాఫీస్ వార్‌లో గెలుపెవరిది??

who is box office winner chaitanya or samantha
Share Icons:

హైదరాబాద్, 14 సెప్టెంబర్:

తాజాగా వినయచవితి సందర్భంగా తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఎప్పటిలాగే కొత్త సినిమాలు వెండితెరపై సందడి చేశాయి. పెద్ద హీరోలంతా పండుగలకు బరిలోకి దిగి పోటీ పడటం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం.

ఈ సారి అనూహ్యంగా భార్యాభర్తలిరువురూ నువ్వా నేనా అన్నట్టు పోటీ పడుతూ వినాయకచవితి బరిలోకి దిగారు.  వారెవరో ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది.

‘శైలజా రెడ్డి అల్లుడు’గా నాగ చైతన్య రాగా, ‘యూటర్న్’తో అతని భార్య సమంతా కూడా భర్తకి పోటీ ఇస్తూ తన చిత్రాన్ని విడుదల చేసింది. ఇద్దరి చిత్రాలు ఒకే రోజు విడుదల అయ్యాయి కదా గెలుపెవరిది? అంటే…

ఇంకెవరిది.. ఏమాత్రం హంగూ ఆర్భాటాలు లేకుండా సైలెంట్‌గా వచ్చిన సమంతదే. ఎందరో గొప్ప నటీనటులతో తెరకెక్కిన ‘శైలజా రెడ్డి అల్లుడు’మాత్రం పాత చింతకాయ పచ్చడి ఫార్ములా ఫాలో అయ్యి బాక్సాఫీస్ వద్ద చతిగిలిపడిపోయింది.

సమంతా ముఖ్య పాత్రలో నటించిన యూటర్న్ చిత్రంపై ముందు నుండి ఎలాంటి అంచనాలు లేకున్నా మంచి కథ, అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుని విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుని సక్సెస్ బాట పట్టింది..

మామాట: మొత్తానికి భార్యదే పై చెయ్యి అని నిరూపించింది…

Leave a Reply