TRENDING NOW

టీ. శాసనసభలో ఎవరు తాగారు, ఎవరు ఊగారు, ఏం మాట్లాడుతున్నారు? : జానా

టీ. శాసనసభలో ఎవరు తాగారు, ఎవరు ఊగారు, ఏం మాట్లాడుతున్నారు? : జానా
views:
19

హైదరాబాద్, మార్చి 12 :

తాము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతుంటే తెలంగాణ ప్రభుత్వం తమను మార్షల్స్‌తో అడ్డుకుందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు జానారెడ్డి ఆరోపించారు. శాసనసభ్యులలో తాగి వచ్చిందెవరని, తాగి ఊగిందెవరు.? ఎలాంటి ఆరోపణలు చేస్తున్నారో? మీకు అర్థమవుతోందా? అని ఆయన ప్రశ్నించారు.

బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ నాయకులు అనవసరపు ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్నామని జానారెడ్డి చెప్పారు. అయితే తమపై మార్షల్స్ ప్రయోగం చేయడానికి ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలాంటి సమయంలో తమ సభ్యులు తాగి ఉన్నారని తెరాస సభ్యుల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. తమ సభ్యులు అంత నీచంగా వ్యవహరించరని అన్నారు. తాగి ఊగేది ఎవరో జనానికి చాలా చక్కగా తెలుసునని అన్నారు. అలాంటి తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మామాట : ఆరోపణ ప్రత్యారోపణలతో శాసనసభ పరువు బజారుకెక్కిస్తున్నారు.

English Summary :

Telangana Congress leader Jana Reddy alleged that, TRS leaders are blaming the congress leader are having liqour, that is false satement. Drinking is TRS leaders habit not congress habit.

(Visited 17 times)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: