శ్వేతపత్రాల చిత్రాలు చూద్దామా…!

white-paper-by-ap-govt-and-facts
Share Icons:

తిరుపతి, జనవరి 02:

శ్వేతపత్రం అంటే తెల్లని పత్రం. అందులో మరో మరకా ఉండకూడదు. తెలుపు స్వచ్చతకు ప్రతీక. ప్రభుత్వం విడుల చేసే ఈ శ్వేతపత్రం తెల్లని తెలుపుతో, మరో రహస్యకర మచ్చలూ లేకుండా, కేవలం వాస్తవాలతో ఉండాలనేది ఇందులోని ఉద్దేశం.

[pinpoll id=”67563″]

అంధ్రప్రదేశ్ 2014లో తెలంగాణ, నవ్యాంధ్ర గా విభజింప బడింది. అప్పటి నుంచి అన్నీ అనుమానాలే.. అసూయలే.. అపనమ్మకాలే వెంటాడుతున్నాయి. పరిపాలనలో అనుభవం ఉంది కదా, ఈ చారిత్రిక సమయంలో చంద్రబాబు పాలన రాష్ట్రానికి మేలు చేస్తుందని ప్రజలు భావించారు. కానీ దాదాపు పాలనా కాలం ముగుస్తున్నా, తాము చేసింది మంచిపనే అనే నమ్మకం ప్రజల్లో కలగడం లేదు. అనేక యూ టర్న్ ల తరువాత తాజాగా  చంద్రబాబు శ్వేతపత్రాలపేరుతో రోజుకు ఒక ప్రకటనాపత్రం విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈ శ్వేతపత్రాలలో  ప్రభుత్వం వెళ్లడిస్తున్నవి నిజాలేనా, కేవలం అంకెల గారడీయా… మీరేమనుకుంటున్నారు. ఈ శ్వేతపత్రాలు పారదర్శకంగా ఉన్నాయంటారా. నమ్మవచ్చా…

మామాట: శ్వేతపత్రాలపై మరో ప్రమాణ పత్రం అవసరమయ్యేలాగుందే…

Leave a Reply