జర్నలిస్టుపై ట్రంప్ ప్రతాపం.. ప్రశ్నించాడని నిషేధం…

white-house-is-suspending-the-hard-pass-of-the-reporter of CNN
Share Icons:

వాషింగ్టన్, 8 నవంబర్:

మధ్యంతర ఎన్నికల ఫలితాల్లో పరాభవం చెందిన తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తనపై ప్రశ్నల వర్షం కురిపించిన సీఎన్‌ఎన్ జర్నలిస్టు జిమ్ అకోస్టాపై ట్రంప్ ప్రతాపం చూపించాడు.

లాటిన్ అమెరికా నుంచి వస్తున్న వలసలను ట్రంప్ దండయాత్రగా వర్ణించడాన్ని జర్నలిస్టు ప్రశ్నించగా…. చట్టబద్ధంగా వస్తే బాగుంటుందని.. కానీ చట్టవిరుద్ధంగా వస్తే ఎలా అని ట్రంప్ ఎదురు ప్రశ్నించారు. అయితే దానిపై మరింత వివరణకోరడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ట్రంప్ … నన్ను దేశాన్ని పాలించనివ్వు.. నువ్వు సీఎన్ఎన్ పని చూసుకో.. మంచిగా పనిచేస్తే మంచి రేటింగ్స్ వస్తాయి’’ అంటూ అకోస్టాకు చురకంటించే ప్రయత్నం చేశారు.

అలాగే జర్నలిస్టు రష్యాకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు కూడా అడిగాడు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ట్రంప్ జిమ్ అకోస్టా ప్రెస్ పాస్‌ను రద్దు చేశాడు. వైట్‌హౌస్‌కు జిమ్ అకొస్టా అనుమతిని వైట్‌హౌస్ సిబ్బంది నిరాకరించారు.

మామాట:  వివాదం లేకుండా ట్రంప్ ఉండటం కష్టమే….

Leave a Reply