వాట్సప్‌లో సరికొత్త ఫీచర్…సెక్యూరిటీకి ఇబ్బంది లేదు…

WhatsApp fingerprint lock for Android smartphones now rolling out with latest update
Share Icons:

ముంబై: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ ని తీసుకొచ్చింది. యూజర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ వచ్చేసింది. ఎన్నో రోజులు దీనిపై టెస్ట్ చేసిన వాట్సప్…యూజర్లకు ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ రిలీజ్ చేసింది. ఆండ్రాయిడ్‌లో వాట్సప్ యూజర్లు ఇప్పుడు ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఆథెంటికేషన్ ఫీచర్‌ని ఉపయోగించుకోవచ్చు. దీంతో మీ వాట్సప్ ఛాట్స్‌కు బయోమెట్రిక్ సెక్యూరిటీ లభించినట్టైంది.

ఇప్పటికే చాలా పాపులర్ యాప్స్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్‌ని అందిస్తున్నాయి. వాట్సప్ మాత్రం చాలా కాలంగా ఈ ఫీచర్‌ని ఊరిస్తోంది. ఇప్పుడు వాట్సప్ కూడా యూజర్లకు ఫింగర్ ప్రింట్ ఫీచర్ రిలీజ్ చేసింది. ఐఫోన్లకు టచ్ ఐడీతో పాటు ఫేస్ ఐడీ ఆథెంటికేషన్ రిలీజ్ చేసింది వాట్సప్. కానీ ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రం కేవలం ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్ ఫీచర్ మాత్రమే తీసుకొచ్చింది.

కొత్త ఫీచర్ పొందడం ఎలా అంటే….

వాట్సప్‌లో ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ ఫీచర్ వాడుకోవాలనుకుంటే ముందుగా గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి వాట్సప్ యాప్ అప్‌డేట్ చేయాలి. అప్‌డేట్ ఇన్‌స్టాల్ అయిన తర్వాత సెట్టింగ్స్ ఓపెన్ చేసి ప్రైవసీ సెట్టింగ్స్‌లో అకౌంట్స్ సెక్షన్‌లో ఫింగర్‌ప్రింట్ లాక్ ఫీచర్ ఆన్ చేయొచ్చు. యాప్ క్లోజ్ చేయగానే ఫింగర్‌ప్రింట్ ఆథెంటికేషన్ క్లోజ్ కావాలా లేక కొంత సమయం తర్వాత క్లోజ్ కావాలా అని కూడా సెట్టింగ్స్ మార్చుకోవచ్చు.

యాపిల్ వాచ్ లకు పోటీగా గూగుల్

ప్రముఖ సాఫ్ట్ వేర్ దిగ్గజం గూగుల్….మరో సాఫ్ట్ వేర్ దిగ్గజం యాపిల్ కి పోటీగా అమెరికాకు చెందిన ప్రఖ్యాత స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీ ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేసింది. సుమారు 2.1 బిలియన్ డాలర్లకు (భారత కరెన్సీలో రూ.14,845 కోట్లు) ఫిట్‌బిట్‌ను గూగుల్ కొనేసింది. శాంసంగ్, యాపిల్ తరహాలోనే గూగుల్ కూడా తమ సొంత ఫోన్లను తయారు చేస్తోంది. దీంతోపాటు ఆయా కంపెనీలు స్మార్ట్ వాచ్‌ల విభాగంలో కూడా ముందున్నాయి. ఈ రంగంలో గూగుల్ తన మార్క్ చూపించలేకపోతోంది. అదే సమయంలో అమెరికాలో ఫిట్‌నెస్ ట్రాకర్ వాచ్‌లు తయారు చేసే ఫిట్‌బిట్‌ను కొనుగోలు చేయడం ద్వారా యాపిల్, శాంసంగ్ కంపెనీలకు పోటీ ఇవ్వొచ్చని అంచనా వేస్తోంది.

 

Leave a Reply