ఇక ఆ కాంగ్రెస్ దిగ్గజాల కథ కంచికేనా?

Share Icons:

హైదరాబాద్: ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న కాంగ్రెస్ పరిస్తితి రాష్ట్ర విభజన తర్వాత ఎలా అయిపోయిందో చెప్పాల్సిన పని లేదు. ఆ పార్టీ నేతలు ఎక్కువగా వైసీపీ, టీడీపీల్లోకి వెళ్ళిపోయారు. ఇక కొంతమంది అలాగే కాంగ్రెస్‌లో ఉండిపోయారు. అయితే   ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న ఓ  ఇద్దరు కాంగ్రెస్ దిగ్గజాల పదవీ కాలం ముగియబోతోంది ఏప్రిల్ 9వ తేదీనాటితో. ఇక వారు మాజీగా మిగలడానికే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి. మళ్లీ రాజ్యసభకు ఎన్నిక కావడానికి ఏ మాత్రం అవకాశాలు లేవు. ఆ ఇద్దరూ- కేవీపీ రామచంద్ర రావు, టీ సుబ్బరామి రెడ్డి.

ఏప్రిల్ 9వ తేదీన కేవీపీ రామచంద్ర రావు రాజ్యసభ సభ్యత్వం ముగియబోతోంది. రాష్ట్ర విభజన అనంతరం ఆయన తెలంగాన కోటా కిందికి వెళ్లారు. ఆయనను మళ్లీ నామినేట్ చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి సున్నా స్థాయికి దిగజారింది. ఇప్పట్లో కోలుకునేలా లేదనే అనుకోవచ్చు. పేరున్న నాయకులెవరూ పెద్దగా ఆ పార్టీలో లేరు. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కొద్దో, గొప్పో బలం ఉంది హస్తం పార్టీకి. పార్టీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేయడానికి ఆ బలం సరిపోదు. ఉందనే అనుకున్నా.. కేవీపీకి ఆ అవకాశం ఎంతమాత్రమూ దక్కదు. వైసీపీకి బలం ఉన్నప్పటికీ.. ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయాలనే ఆలోచన కూడా లేదు

అటు కేవీపీకి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంది టీ సుబ్బరామిరెడ్డి పరిస్థితి. కారణం- కాంగ్రెస్సే. కేంద్ర మాజీమంత్రిగా పనిచేసిన టీఎస్సార్.. మరోసారి రాజ్యసభలో అడుగు పెట్టే అవకాశాలు లేవు. పారిశ్రామికవేత్తగా ఆయనకు ఆ రంగానికి చెందిన పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. కళాబంధుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ పెద్దలతోనూ సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు కూడా ఆయనను రాజ్యసభకు మరోసారి నామినేట్ చేయడానికి ఉపయోగపడకపోవచ్చు.

 

Leave a Reply