వేడినీరు ఎంతో మేలు

Share Icons:

తిరుపతి, ఆగష్టు 05,

ఉదయం వేళ నిద్రలేస్తూనే వేడి నీటిని తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

అలా, పరగడుపున వేడి నీటిని తీసుకోవడం వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలు, చెడు పదార్థాలు, వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపరచడంలో వేడి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. పైల్స్ సమస్యతో బాధపడేవారు వేడి నీటిని తీసుకుంటే ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చు.

ఉదయాన్నే రెండు గ్లాసుల వేడి నీటి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలోని వేడి వేగంగా కరిగిపోతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే తినడానికి ముందుగా గ్లాస్ వేడి నీటిని తీసుకుంటే కడుపు నొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి.

శరీర మెటబాలిజం వేగవంతమవుతుంది. ఈ వేడినీళ్లు క్యాలరీలను తొలగించుటలో చక్కని ఔషధంగా పనిచేస్తాయి. శ్వాస కోశ సమస్యలు దూరమవుతాయి. శ్వాస ప్రక్రియ మెరుగుపడుతుంది.

మామాట: వేడి నీరు మంచిదంటే సరే అలాగే కానీయ్..

Leave a Reply