బలహీనంగా మారిన రుతుపవనాలు..

weak monsoon in telangana state
Share Icons:

హైదరాబాద్, 16 జూన్:

అనుకున్న సమయం కంటే ముందుగానే నైరుతి రుతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చాయి. ఇక అంతా ఎండలు పోయాయి, వానాకాలం వచ్చేసింది అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మూడు, నాలుగు రోజులు వర్షాలు కూడా పడ్డాయి.

కానీ ఉన్నట్టుండి రుతుపవనాలు బలహీనంగా మారడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి, ఎండలు పెరిగాయి, ఉక్కబోత మొదలైంది.

శుక్రవారం పగటి ఉష్ణోగ్రతలు పెరిగి హైదరాబాద్, ఖమ్మం, మెదక్ లో సాధారణం కంటే నాలుగు డిగ్రీల అధికంగా 38 డిగ్రీలగా నమోదు అయ్యింది. ఇక ఆదిలాబాద్, నల్గొండ, భద్రాచలం, రామగుండంలో గరిష్ఠం 39 డిగ్రీలుగా ఉంది.

రుతుపవనాలు బలహీనంగా మారడం వలనే ఇలాంటి వాతావరణం ఉందని, రాబోయే వారం రోజులు ఇదే విధంగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి వెల్లడించారు.

అయినా అక్కడక్కడ చిరు జల్లులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని తెలిపారు. ఛత్తీస్ ఘడ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్నాటక వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని.. అయితే ఇది భూమికి 8 కిలోమీటర్ల ఎత్తులో ఉండటం వల్ల తేలికపాటి వర్షాలు మాత్రమే పడి అవకాశం ఉంటుందని ప్రకటించారు. కాగా, రైతులు తొందరపడి ఇప్పుడే వ్యవసాయ పనులు మొదలు పెట్టొద్దని వాతావరణ శాఖ సూచించింది.

మామాట: మొత్తానికి మూడు రోజులు బాగానే మురిపించాయిగా…

Leave a Reply