రక్తం కారుతున్న గెలుపు కోసం పోరాడిన వాట్సన్…

Share Icons:

హైదరాబాద్, 14 మే:  

హైదరాబాద్ వేదికగా ఆదివారం జరిగిన ఐపీఎల్ ఫైనల్ లో ముంబై చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఒక పరుగు తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే చెన్నై విజయం కోసం చెన్నై ఓపెనర్ షేన్ వాట్సన్ ఎంతో కష్టపడ్డాడు.

ఇక తన జట్టును దాదాపు గెలిపించినంత పని చేసిన వాట్సన్, అవుట్ కావడానికి ముందు మైదానంలో గాయపడ్డాడు.  అది ఎంత పెద్ద గాయం అంటే, మోకాలి వద్ద తగిలిన దెబ్బకు కారిన రక్తం, ప్యాంట్ ను తడిపేసి బయటకు కనిపించేంత.

ఇక అలా గాయంతోనే చెన్నైని గెలిపించాలని వాట్సన్ ప్రయత్నించాడు. ఈ క్రమంలోనే భరించలేని బాధతో వికెట్ల మధ్య పరిగెత్తలేక అవుట్ అయ్యాడు. వాట్సన్ గాయానికి సంబంధించిన వివరాలను  జట్టు సభ్యుడు హర్భజన్ సింగ్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకున్నాడు. వీటిని చూసిన వారంతా ‘వాట్సన్ గ్రేట్’ అని కితాబిస్తున్నారు.

మామాట: నిజంగానే వాట్సన్ గ్రేట్…

Leave a Reply