హౌస్ లో మహేశ్-అలీ మాటల యుద్ధం…

war words between mahesh and ali in house
Share Icons:

హైదరాబాద్:

బిగ్ బాస్ షో రోజురోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. గురువారం ఎపిసోడ్ కూడా ఒకవైపు ఎంటర్టైన్మెంట్ జరుగగా, మరోవైపు మహేశ్-అలీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. బుధవారం జరిగిన టాలెంట్ షో కొనసాగింపుగా గురువారం రెండో రౌండ్ జరిగింది. రెండో రౌండ్‌లో అలీ రెజా, మహేష్ విట్ట, రవికృష్ణ, వరుణ్ సందేశ్‌లు నిలిచారని జడ్జిలు బాబా భాస్కర్, శ్రీముఖిలు చెప్పారు.

రెండో రౌండ్ ప్రారంభంలో జడ్జిలు పంచదార బొమ్మ సాంగ్ కి డ్యాన్స్ వేసి ఆకట్టుకున్నారు. తర్వాత అలీ తాను ప్రేమించిన అమ్మాయి ప్రమాదంలో చనిపోతే ఎలా ఉంటుందో చేసి చూపించి అందరి చేత కంటతడి పెట్టించారు. ఇక్ మహేశ్ డబ్బులకు మాటలు వస్తే దాని ఫీలింగ్స్ ఎలా ఉంటాయో చేసి చూపించాడు. ఆ తర్వాత రవి ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తే పిచ్చోడిలా నటించాడు. ఇక వరుణ్ ఆ ముగ్గురిలో ఒకరు విన్నర్ కావాలని కోరుకుంటూ పాట పాడి అలరించాడు.

అయితే వీరిలో చివరికి అలీ గెలిచినట్లు జడ్జిలు ప్రకటించాడు. అలీకి ఫిజ్ జాకెట్ ఇచ్చి. ఈ వారమంతా సెలబ్రెటీలా ఉంటాడని బిగ్ బాస్ ప్రకటించారు. ఈ టాస్క్ ముగిశాక బిగ్ బాస్ ఫిర్యాదుల బాక్స్ పెట్టి ఎవరికైనా ఎవరి మీదైన ఫిర్యాదు ఉంటే రాసి అందులో వేయాలని. దాన్ని కెప్టెన్ జ్యోతి చదివి, పరిష్కరించాలని కోరారు. ఈ క్రమంలో మొదట రెండు కంప్లైంట్లు మహేశ్ మీద రాగా, మహేశ్ అలీ మీద ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. ఒకరినొకరు తిట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో కెప్టెన్ జ్యోతి ఇద్దరికీ సర్ది చెప్పారు.

శ్రీముఖికి సంబంధించిన కంప్లైంట్‌ని రాహుల్ రాయ‌గా, దానిని శివ‌జ్యోతి చదివి వినిపించింది. దీనిని స్పోర్టివ్‌గా తీసుకున్న శ్రీముఖి రాహుల్‌కి హ‌గ్ ఇచ్చింది. కాని అంత‌లోనే రాహుల్ లేచి మ‌ళ్ళీ పాత స్టోరీనే వివ‌రించే ప్ర‌య‌త్నం చేయ‌గా, దీనిపై మండిప‌డింది శ్రీముఖి. అయితే ఎక్కువ కంప్లైంట్స్ మ‌హేష్‌, రాహుల్‌పై రావ‌డంతో వారిద్ద‌రిని జైలులో వేసి తాళం వేయాల‌ని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో 33వ ఎపిసోడ్ ముగిసింది.

Leave a Reply