తెలంగాణ అసెంబ్లీలో మాటల యుద్ధం: కేసీఆర్ వర్సెస్ భట్టి

war words between kcr and bhatti vikramarka in assembly
Share Icons:

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్….ప్రతిపక్ష నేత మల్లు భట్టి విక్రమార్కల మధ్య మాటల యుద్ధం నడిచింది. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్ ఉండగా.. ఇప్పుడు ఆరేళ్లకే దివాలా తీసిన ప్రభుత్వంగా బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి రాష్ట్రాన్ని హాస్యాస్పదంగా మార్చారని భట్టి విక్రమార్క విమర్శించారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. ‘‘రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు మిగులు బడ్జెట్ ఉందంటున్నారు.. రాష్ట్రమే లేకుంటే బడ్జెట్ ఎక్కడిది? ఇదో పెద్ద జోకు అని సెటైర్ వేశారు.

రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు మిగులు బడ్జెట్ ఎక్కడిది? రాష్ట్రం తెచ్చుకున్నప్పుడు బడ్జెట్ తయారు చేయడానికే ప్రాతిపాదిక లేదని, ఆ మాట కూడా తను స్పష్టంగా చెప్పానని అన్నారు.  ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు సభను తప్పుదోవ పట్టించడం మంచిది కాదని సీఎం హితవు పలికారు.  చాలా మంది ఆర్థిక నిపుణులను సంప్రదించి బడ్జెట్‌ను రూపొందించామని, వాస్తవిక దృక్పథంతోనే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టామని, ఎన్నో రాష్ట్రాలకంటే మనం చాలా ఉత్తమమైన స్థానంలో ఉన్నామని చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత ప్రాజెక్టుల ప్రస్తావన గురించి కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణను ముంచే పోలవరం వద్దని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయం రికార్డుల్లో ఉంది కావాలంటే చూసుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీల నేతలకు సూచించారు. ఇందిరాసాగర్‌ పేరుతో… పోలవరాన్ని ప్రతిపాదించి కాంగ్రెస్‌ తెలంగాణకు అన్యాయం చేసిందని గులాబీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఖమ్మం జిల్లాకు 100 టీఎంసీలు కేటాయించిన ఘనత టీఆర్ఎస్ సర్కార్‌దేనని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్‌ నేతలు కళ్లున్న కబోదుల్లా మాట్లాడుతున్నారని. ప్రతిపక్షం వంకతో ఇష్టంవచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని, కాళేశ్వరం, భక్తరామదాసు ప్రాజెక్టులు వీరికి కన్పించడంలేదా?. మిషన్‌ కాకతీయ ద్వారా 27వేల చెరువులను నింపామని ఆనంరు. ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టిన కాంగ్రెస్‌ నేతల బుద్ధి మారడంలేదు’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ఇక కేసీఆర్ వ్యాఖ్యలపై భట్టి స్పందిస్తూ… కళ్లు లేని కబోదులని, బుద్ధి, జ్ఞానం లేదంటూ ప్రతిపక్షనేతలను సీఎం విమర్శించడాన్ని తప్పుబట్టారు. వయస్సులో ముఖ్యమంత్రి తనకంటే చాలా పెద్ద అని.. ఆయన ఉపయోగిస్తున్న భాషను తానూ వాడగలనన్నారు. అంతకంటే ఎక్కువ మాట్లాడగలనని.. కానీ అది తన సంస్కారం కాదన్నారు. సభాధ్యక్షుడిని, సభా నాయకుడిని తాను గౌరవిస్తానని చెప్పారు. సభలో తనకు మాట్లాడే హక్కు ఉందని.. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు.

Leave a Reply