వెన్నులో వణుకు పుడుతుందా అని ట్వీట్ చేసిన విజయసాయి…నువ్వా నన్ను బెదిరించేది అన్న ఉమా

war words between devineni uma and vijayasai reddy
Share Icons:

విజయవాడ:

 

ఏపీలో టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుంది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు నేతలపై విమర్శలు చేస్తుండగా….ఇక విజయసాయికి టీడీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ప్రాజెక్టు పనుల రివర్స్ టెండరింగ్ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పగానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడికి వెన్నులో వణుకు పుడుతోందా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు.

 

సీఎం జగన్ మోహన్ రెడ్డికి కుల బలహీనతలు లేవని, అవి ఉన్నది చంద్రబాబుకేనని సెటైర్లు వేశారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, “ప్రాజెక్టుల పనులకు రివర్స్ టెండరింగ్ అమలులోకి వస్తుందనగానే మీకు, మీ అధినేతకు వెన్నులో వణుకు పుడుతుందా ఉమా? పోలవరంలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి కక్కిస్తాం. మీలాగా కుల, వర్గ బలహీనతలు సీఎం జగన్ గారికి లేవు. చూస్తారుగా తొందరెందుకు?” అని అన్నారు.

 

ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేత దేవినేని ఉమ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నేడు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘విజయసాయి రెడ్డి ఇప్పుడు ట్వీట్ చేయవయ్యా… ఇంటర్ పోల్ నిందితులు మీరు, మీ సహచరుడిని అరెస్టు చేస్తే..‌ విడిపించడానికి ప్రధాని చుట్టూ తిరుగుతున్నారు. దమ్ముంటే వీటిపై ట్వీట్ చెయ్. కేసుల నుంచి బయట పడేందుకు ప్రధాని కాళ్ల పై పడింది మీరు. అవినీతి పరులు.. నీతి సూత్రాలు వల్లిస్తున్నారు’’ అంటూ ధ్వజమెత్తారు.

 

పోలవరం విషయంలో జగన్ అసత్యాలు ప్రచారం చేశారని.. పునాదులు లేపకపోతే.. స్పిల్ ఛానల్ దాటి నీరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. చేసిన అసత్య ప్రచారాలకు ఇప్పుడైనా లెంపలు వేసుకోండని దేవినేని ఉమ పేర్కొన్నారు. రూ.11వేల కోట్లతో తాము పోలవరం పనులను పూర్తి చేశామని.. పారదర్శకంగా పనులు చేపట్టామన్నారు. తాము ఎర్రబస్సు ఎక్కి వచ్చామని.. ‌విజయసాయిరెడ్డి లాగా విమానాలు ఎక్కి రాలేదని ఎద్దేవా చేశారు.

Leave a Reply