వు టెక్నాలజీస్ సరికొత్త స్మార్ట్‌టీవీలు…

Share Icons:

ముంబై: ప్రముఖ వు టెక్నాలజీస్‌ కంపెనీ వు ప్రీమియం టీవీ సిరీస్‌లో నూతన స్మార్ట్‌టీవీలను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. 32 ఇంచుల వు ప్రీమియం టీవీ ధర రూ.10,999 ఉండగా, 43 ఇంచుల టీవీ ధర రూ.19,999గా ఉంది. వీటిని ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తున్నారు.  32, 43 ఇంచ్‌ డిస్‌ప్లే సైజుల్లో ఈ టీవీలు లభిస్తున్నాయి. 32 ఇంచుల టీవీలో హెచ్‌డీ రిజల్యూషన్‌, 43 ఇంచుల టీవీలో ఫుల్‌ హెచ్‌డీ రిజల్యూషన్‌ను అందిస్తున్నారు. వీటిలో ఆండ్రాయిడ్‌ 9.0, బిల్టిన్‌ క్రోమ్‌క్యాస్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌, యూట్యూబ్‌, హాట్‌ స్టార్‌, ప్రైమ్‌ వీడియో, గూగుల్‌ ప్లే స్టోర్‌ ఇన్‌ బిల్ట్‌ యాప్స్‌ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

రియల్‌మి నుంచి స్మార్ట్‌టీవీలు

మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి ఇక స్మార్ట్‌టీవీల తయారీపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలోనే ఆ కంపెనీ త్వరలో స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ మేరకు రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు. రియల్‌మి స్మార్ట్‌ టీవీలు ఏప్రిల్‌ నెలలో విడుదల కానున్నట్లు తెలిపారు. ఇక ఆ టీవీలలో సౌండ్‌, పిక్చర్‌ క్వాలిటీలు అద్భుతంగా ఉంటాయని రియల్‌మి విడుదల చేసిన టీజర్‌ల ద్వారా మనకు తెలుస్తుంది. రియల్‌ సౌండ్‌, రియల్‌ డిజైన్‌ రియల్‌ క్వాలిటీ కాప్షన్‌తో రియల్‌మి ఇప్పటికే తన స్మార్ట్‌టీవీల టీజర్‌ను విడుదల చేసింది. దీన్ని రియల్‌మి సీఈవో ఫ్రాన్సిస్‌ వాంగ్‌ కూడా ఇప్పటికే తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు.

లెనోవో వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌

లెనోవో కంపెనీ హెచ్‌డీ 116 పేరిట నూతన వైర్‌లెస్‌ హెడ్‌ఫోన్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. వీటిని రూ.2499 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. బ్లూటూత్‌ 5.0 ద్వారా ఈ హెడ్‌ఫోన్స్‌ ఇతర డివైస్‌లకు కనెక్ట్‌ అవుతాయి. వీటిలో డ్యుయల్‌ ఈక్యూ టెక్నాలజీని అందిస్తున్నారు. అందువల్ల యూజర్లు ప్యూర్‌ బేస్‌ను ఆస్వాదించవచ్చు. ఈ హెడ్‌ఫోన్స్‌లో 40 ఎంఎం డ్రైవర్స్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల సౌండ్‌ క్వాలిటీ బాగుంటుంది. ఇక ఈ హెడ్‌ఫోన్స్‌ 24 గంటల బ్యాటరీ బ్యాకప్‌ను ఇస్తాయి.

 

Leave a Reply