హైదరాబాద్: ప్రముఖ టెలివిజన్ సంస్థ వీయు(వు)మరో అడుగు ముందుకేసింది. టెలివిజన్ పరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేక ముద్ర వేసిన వీయు సరికొత్త ఫీచర్లతో ప్రీమియం వు 4కె టీవీని ఆవిష్కరించింది. అందరికీ 4కె టీవీ సేవలు అందించాలనే లక్ష్యంతో దీనిని రూపొందించింది ఆ సంస్థ. 4కె టీవీ శ్రేణిలో మూడు రకాల సైజులు లభ్యమవుతున్నాయి. దీని ప్రారంభ ధర రూ. 24,999గా ఉంది.
43 అంగుళాలు(109 సెంటీమీటర్లు), 50 అంగుళాలు(127 సెంటీమీటర్లు)తోపాటు 55 అంగుళాలు(140 సెంటీమీటర్ల)సైజుల్లో వీటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ప్రముఖ ఈ- కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా వినియోగదారులకు విక్రయించనున్నారు. దేశంలోని 19వేల పిన్‌కోడ్ మండలాలకు అందుబాటులో ఉంచనున్నారు.
వియూ ప్రీమియం 4కె టీవీ ఫీచర్లు
బెజల్-లెస్ డిజైన్, వీఓడీ అప్ స్కేలర్, క్వాడ్ కోర్ ప్రాసెసర్, 16జీబీ స్టోరేజ్‌తోపాటు 2జీబీ ర్యామ్.
ఆండ్రాయిడ్ 9.0పైతో క్రికెట్ మోడ్ వంటి విలాసవంతమైన వీక్షణ అనుభవం
గూగుల్ క్రోమ్‌క్యాస్ట్, వైఫై, బ్లూటూత్ 5.0, హెచ్డిఎమ్ఐ సీఈసీ, వాయిస్ సెర్చ్, గూగుల్ అసిస్టెన్స్ కనెక్టివిటీ ఉన్నాయి
ప్లేస్టోర్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి ఒవర్ ద ట్యాప్ మీడియా సర్విసెస్(ఒటిటి) సపోర్ట్.
ఏ ప్లస్ గ్రేడ్ ప్యానెల్ 400ప్లస్ నిట్స్ బ్రైట్ నెస్
డాల్బీ విజన్, హెచ్ఆర్డీ 10 సపోర్ట్
30 వాట్ నాయిస్ క్యాన్సిలేషన్ స్పీకర్లతో డాల్బీ ఆడియో, డీటీఎస్ వర్ట్యువల్ ఎక్స్ సరౌండ్ సౌండ్ టెక్నాలజీ
ఒప్పో కొత్త స్మార్ట్‌వాచ్
ఒప్పో బ్రాండ్ నుంచి మొట్టమొదటిసారిగా స్మార్ట్‌వాచ్ మార్కెట్లోకి వచ్చింది. స్యామ్సంగ్ గెలాక్సీ వాచ్ యాక్టివ్ 2 గాడ్జెట్‌కు పోటీగా ఒప్పో ఈ స్మార్ట్‌వాచ్ ఇప్పుడు ఆకర్షిస్తున్నది. ఇది చూడటానికి అచ్చం Apple Watch Series 4 మాదిరిగానే కనిపిస్తోంది. ఫీచర్లలో అమోలెడ్ డిస్ప్లే, VOOC చార్జింగ్ టెక్నాలజీ, ECG సెన్సార్ బోర్డు ఉంది. ఒకసారి చార్జ్ చేస్తే సాధారణ వాడకంపై 40 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంది. బ్యాటరీ సేవింగ్ మోడ్ ద్వారా 21 రోజుల వరకు బ్యాటరీ చార్జింగ్ వస్తుంది. 41ఎంఎం వాచ్ ధర రూ.16వేలు, 46ఎంఎం ధర రూ.21,400గా ఉంది.