వీయూ టెక్నాలజీస్ కొత్త 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీ…

Share Icons:

ముంబై: దిగ్గజ వీయూ టెక్నాలజీస్‌ కంపెనీ వీయూ సినిమా టీవీ సిరీస్‌లో నూతన 4కె అల్ట్రా హెచ్‌డీ టీవీ లను భారత్‌లో విడుదల చేసింది. 43 ఇంచుల వీయూ సినిమా టీవీ ధర రూ.26,999 ఉండగా, 50 ఇంచుల టీవీ ధర రూ.29,999గా ఉంది. అలాగే 55 ఇంచుల వీయూ సినిమా టీవీని రూ.33,999 ధరకు విక్రయిస్తున్నారు. వీటిని జనవరి 18వ తేదీ నుంచి అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.

వీటిలో వీయూ పిక్సెలియం గ్లాస్‌ టెక్నాలజీని అందిస్తున్నారు. అందువల్ల పిక్చర్‌ క్వాలిటీ బాగుంటుంది. ఈ టీవీలలో 40 వాట్ల ఇన్‌బిల్ట్‌ ట్వీటర్‌, సౌండ్‌బార్‌లను అందిస్తున్నారు. వీటికి డాల్బీ అట్మోస్‌ సపోర్ట్‌ ఉంది. అందువల్ల సౌండ్‌ క్వాలిటీ బాగుంటుంది. ఇక ఈ టీవీలను ఫ్రేమ్‌లెస్‌ ఎడ్జెస్‌తో రూపొందించారు. అందువల్ల వీటికి స్టయిలిష్‌ లుక్‌ వచ్చింది. ఈ టీవీలలో ఆండ్రాయిడ్‌ 9.0 ఓఎస్‌ను ఏర్పాటు చేశారు. నెట్‌ఫ్లిక్స్‌, ప్రైమ్‌ వీడియో, యూట్యూబ్‌, గూగుల్‌ ప్లే యాప్స్‌ను ఇన్‌బిల్ట్‌గా అందిస్తున్నారు. ఈ టీవీలు 43, 50, 55 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో లభిస్తున్నాయి. వీటిలో 1.5 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, ఇన్‌బిల్ట్‌ క్రోమ్‌క్యాస్ట్‌, వైఫై, బ్లూటూత్‌ 5.0 తదితర ఇతర ఫీచర్లను కూడా అందిస్తున్నారు.

ఒప్పో ఎఫ్‌15

ప్రముఖ మొబైల్స్‌ తయారీదారు ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ఎఫ్‌15ను భారత్‌లో తాజాగా విడుదల చేసింది. రూ.19,990 ధరకు ఈ ఫోన్‌ను విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా పలు ఆఫర్లను అందిస్తున్నారు. ఇందులో.. 6.4 ఇంచుల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌, ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ హీలియో పి70 ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డ్యుయల్‌ సిమ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, 48, 8, 2, 2 మెగాపిక్సల్‌ బ్యాక్‌ కెమెరాలు, 16 మెగాపిక్సల్‌ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, డ్యుయల్‌ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్‌ 5.0, యూఎస్‌బీ టైప్‌ సి, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

మ్యాజిక్‌ వాచ్‌ 2

హువావే తన నూతన స్మార్ట్‌వాచ్‌ మ్యాజిక్‌ వాచ్‌ 2 ను భారత్‌లో విడుదల చేసింది. రూ.11,999 ధరకు ఈ వాచ్‌ను వినియోగదారులు జనవరి 19వ తేదీ నుంచి అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఇక ఇదే వాచ్‌కు చెందిన 42ఎంఎం గోల్డ్‌ వేరియెంట్‌ ధర రూ.14,999 ఉండగా, 46 ఎంఎం బ్లాక్‌ వేరియెంట్‌ ధర రూ.12,999గా ఉంది. అలాగే 46 ఎంఎం బ్రౌన్‌ కలర్‌ వేరియెంట్‌ ధర రూ.14,999గా ఉంది. ఇందులో.. 1.2 ఇంచుల అమోలెడ్‌ టచ్‌ డిస్‌ప్లే, బ్లూటూత్‌ 5.1, వాటర్‌ రెసిస్టెన్స్‌, ఇంటిగ్రేటెడ్‌ మైక్రోఫోన్‌ అండ్‌ స్పీకర్‌, బ్లూటూత్‌ కాలింగ్‌, ఆప్టికల్‌ హార్ట్‌ రేట్‌ సెన్సార్‌, స్లీప్‌ మానిటరింగ్‌, 15 వర్కవుట్‌ మోడ్స్‌, 455 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 14 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్‌.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.

 

Leave a Reply