ఓటు-గెలుపు-ఓటమి?

voting won losers telengana
Share Icons:

మహాభారత యుద్ధకాలంలో కొన్ని నియమాలకు లోబడి పోరు జరిగేది. చీకటిలో యుద్ధం చేయరాదని, స్త్రీలు, పసివారిని చంపరాదనీ, రిక్తహస్తులతో పోరు వద్దనీ కొన్ని ధర్మసూత్రాలకు ఆ నాటి వీరులు కట్టుబడి ఉండేవారు. కానీ ఈ ఆధునిక కాలంలో పోరు లక్ష్యం గెలుపే.. రహదారి గురించి పట్టింపు లేదు, అడ్డదారైనా.. లక్ష్యం చేరడమే ముఖ్యం.

[pinpoll id=”66474″]

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత  తెలంగాణలో రెండో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి అనుకున్న సమయానికి జరుగుతున్నవి కాదు. తెలంగాణ తొలి ప్రభుత్వం పూర్తికాలం నిలువలేదనే అపప్రదతో, ముఖ్యమంత్రి  కేసీఆర్ వ్యూహాలకు అనుగుణంగా.. గ్రహచారాల అడుగులకు, శుభరాశుల ఫలితాల ప్రభావానికి మడుగులొత్తుతూ జరుగుతున్న ముందస్తు ఎన్నికలు. ఏదైతేనేమి ఈ ఎన్నికలు అనూహ్యమైనవి, అలాగే ఎన్నికల ప్రకటన తరువాత అనూహ్యపరిణామాలు చోటు చేసుకుని, ఉప్పు-నిప్పు వంటి కాంగ్రెస్-తెలుగుదేశం పార్టీలు ఒకే గొడుగు కింద నిలబడి ఓటు అడుగుతున్న విచిత్ర, విపరీత పరిస్తితి కూడా.

ఇక ఎంతో హైప్ ఆశించిన జనసేన గానీ, జగన్ సేన గానీ అసలు గోదాలోకే దిగని ఎన్నికలు ఇవి. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ మొదలైంది. ఇప్పటికే ప్రముఖులు చాలా మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.. ఇంతకూ ఈ ఎన్నికల్లో విజేతలుగా నిలిచేదెవరు.. పరాభవ భారాన్ని మోయనున్నదెవరో… ప్రజాభిప్రాయం ఏమిటో..

మామాట:  ఏ పార్టీ గెలిచినా… ఓటరు గెలవడనేది విజ్ఞుల మాట !

Leave a Reply