ఓటుకు నోటు కేసులో చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ…

Share Icons:
  • రేవంత్ రెడ్డిపై మనీ లాండరింగ్ కేసు  

ఎంతో సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసు మొత్తం చందరాబు చుట్టూ తిరిగినప్పటికీ ఆయనపేరును ఛార్జ్ షీట్ లో చేర్చకపోవడం తో చంద్రబాబు ఈ కేసు నుంచి బయటపడినట్లేనని తెలుగుదేశం వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ కేసు ఇరు తెలుగురాష్ట్రాల్లో అత్యంత ఆశక్తి ని రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరు కూడా రావడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అయితే, ఈ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈరోజు ఈ కేసుకు సంబంధించి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి (అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యే)పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రేవంత్ పై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. అయితే, ఈ ఛార్జ్ షీట్ లో చంద్రబాబు పేరు ప్రస్తావనకు వచ్చినప్పటికీ, నిందితుడిగా మాత్రం ఈడీ ఆయనను పేర్కొనలేదు. దీంతో, చంద్రబాబుకు ఊరట లభించినట్టయింది.

 

రేవంత్ రెడ్డిపై చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ

 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో స్టీఫెన్ సన్ కు రేవంత్ రెడ్డి రూ. 50 లక్షలు ఇచ్చినట్టు తెలంగాణ ఏసీబీ తన ఛార్జ్ షీట్ లో పేర్కొంది. మండలి ఎన్నికల సందర్భంగా, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో రేవంత్ రాయబారాలు నడిపినట్టుగా ఏసీబీ పేర్కొంది. స్టీఫెన్ సన్ ను డబ్బుతో ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేసినట్టు రేవంత్ పై ఆరోపణలు చేసింది.

ఈ అంశానికి సంబంధించి చంద్రబాబుతో రేవంత్, స్టీఫెన్ సన్ సంభాషించినట్టు కాల్ రికార్డులు బయటకు వచ్చిన సంగతి విదితమే. అయినప్పటికీ ఆయన పేరు చర్చకపోవడంపై సర్వత్రా ఆశక్తి నెలకొన్నది . కొన్నేళ్ల కిందట సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నేడు కీలక పరిణామం చోటుచేసుకుంది. సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీటు దాఖలు చేసింది. 2015లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో స్టీఫెన్ సన్ కు రూ.50 లక్షలు ఇవ్వజూపాడంటూ రేవంత్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేయగా, ఈ కేసు ఆధారంగా ఈడీ మనీ లాండరింగ్ అభియోగాలు మోపింది.

అప్పట్లో వీడియో ఆధారాలు బట్టబయలు కాగా, ఈ కేసులో రేవంత్ రెడ్డి కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. బెయిల్ పై బయటికి వచ్చిన ఆయన టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరారు. కాగా, ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పాత్రపైనా ఏసీబీ విచారిస్తోంది. ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడినట్టుగా భావిస్తున్న ఆడియో టేప్ ను ఫోరెన్సిక్ పరిశీలనకు పంపడం తెలిసిందే.

నేడు దాఖలు చేసిన చార్జిషీటులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొన్న ఈడీ… చంద్రబాబు పాత్రను కూడా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అప్పట్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగ్గా… టీడీపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేసేందుకు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రలోభాలకు గురిచేశారన్నది రేవంత్ రెడ్డి, తదితరులపై ఉన్న ప్రధాన అభియోగం.

-కె. రాంనారాయణ, సీనియర్ జర్నలిస్ట్.

Leave a Reply