బడ్జెట్ ధరలో విడుదలైన వివో వై12…

Share Icons:

 

ముంబై, 24 జూన్:

చైనాకి చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ వై12 ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.12,490 ధరకు ఈ ఫోన్ వినియోగదారులకు లభిస్తున్నది.

వివో వై12 ఫీచర్లు…

6.35 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 1544 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ22 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై.

13, 2, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

ఆకట్టుకునే బోట్ హెడ్‌ఫోన్స్‌

బోట్ కంపెనీ బాస్‌హెడ్స్ 950 పేరిట నూతన హెడ్‌ఫోన్స్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. వీటికి డ్యుయల్ టోన్ మెటలిక్ ఫినిషింగ్‌ను ఇచ్చారు. అందువల్ల ఇవి ప్రీమియం లుక్‌తో కనిపిస్తాయి. అలాగే చెవులపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు గాను వీటికి సాఫ్ట్ ప్యాడింగ్‌ను ఏర్పాటు చేశారు. 40 ఎంఎం డ్రైవర్ యూనిట్ ఉండడం వల్ల ఈ హెడ్‌ఫోన్స్ నాణ్యమైన సౌండ్ అవుట్‌పుట్‌ను ఇస్తాయి. కాగా ఈ హెడ్‌ఫోన్స్ రూ.1299 ధరకు వినియోగదారులకు అమెజాన్ సైట్‌లో ప్రత్యేకంగా లభిస్తున్నాయి.

 

Leave a Reply