సూపర్ ఫీచర్లతో విడుదలైన వివో ఎస్1

vivo s1 smartphone released in india
Share Icons:

ముంబై:

 

సెల్ఫీ కెమెరాలకు పెట్టింది పేరైనా వివో సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ వివో ఎస్1 ను ఈరోజు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో 6జీబీ పవర్‌ఫుల్ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే 16, 8, 2 మెగాపిక్సల్ కెమెరాలు మూడు వెనుక భాగంలో ఉన్నాయి. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో మైక్రోఎస్‌డీ కార్డ్, డ్యుయల్ సిమ్ కార్డుల కోసం డెడికేటెడ్ స్లాట్‌లను అందిస్తున్నారు.

 

వివో ఎస్1 స్మార్ట్‌ఫోన్ స్కైలైన్ బ్లూ, డైమండ్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.17,990 ధరకు, 6జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ రూ.18,990 ధరకు లభిస్తున్నాయి. అలాగే 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.19,990 ధరకు విక్రయిస్తున్నారు. కాగా ఈ ఫోన్లను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో విక్రయిస్తున్నారు.

 

 

వివో ఎస్1 ఫీచర్లు…

 

  1. 38 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
  2. 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  3. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పి65 ప్రాసెసర్
  4. 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్
  5. 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్
  6. ఆండ్రాయిడ్ 0 పై, 16, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు
  7. 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 0
  8. ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
  9. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Leave a Reply