సూపర్ ఫీచర్లతో విడుదలైన వివో జడ్1ఎక్స్‌..

vivo released z1x smartphone in india
Share Icons:

ముంబై:

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు వివో తన నూతన స్మార్ట్‌ఫోన్ జడ్1ఎక్స్‌ను తాజాగా భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్, 64 స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.16,990 ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.18,990గా ఉంది. ఈఫోన్‌ను ఈ నెల 13వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనున్నారు.

వివో జడ్1ఎక్స్ ఫీచర్లు…

6.38 ఇంచ్ డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 712 ప్రాసెసర్, 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 2 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, యూఎస్‌బీ టైప్ సి, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

108 ఎంపీ కెమెరా ఫోన్లని విడుదల చేయనున్న షియోమీ

ప్రముఖ చైనా దిగ్గజ మొబైల్స్ తయారీదారు….తక్కువ ధరకే అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేస్తూ సంచనాలు సృష్టిస్తున్న షియోమి స్మస్థ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. మొబైల్స్ వర్గాల తాజా సమాచారం ప్రకారం త్వరలోనే 108 ఎంపీ కెమెరా ఉండే స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురానుంది.

ఇప్పటికే సామ్‌సంగ్ 108 ఎంపీ ఇసోసెల్ బ్రైట్ హెచ్‌ఎమ్‌ఎక్స్ కెమెరా సెన్సర్‌‌ను స్మార్ట్‌ఫోన్లను వాడతామని తెలిపిన షియోమి బృందం.. ఇప్పుడు ఆ దిశగా ముందడుగు వేస్తోంది. ఆ నాలుగు ఫోన్లకు కోడ్ పేర్లు.. టుకానా, డ్రాకో, ఉమి, సిమి అని పెట్టారు. అయితే, మిగతా ఎలాంటి ఫోన్ల ప్రత్యేకతలను కంపెనీ విడుదల చేయలేదు.

అదేవిధంగా సామ్‌సంగ్ ఇప్పటికే ఇసోసెల్ బ్రైట్ హెచ్‌ఎమ్‌ఎక్స్ కెమెరా సెన్సర్లను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తోంది. ఆ కెమెరా సెన్సర్‌తో 12,032*9024 పిక్సెల్ రిజొల్యుషన్‌తో ఫోటోలు తీయవచ్చు. 0.8మైక్రోమీటర్ పిక్సెల్ పరిమాణంలో వస్తోందీ సెన్సర్. అంటే.. డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాల్లో మాదిరిగా ఫోటోల నాణ్యత ఉండనుంది.

 

Leave a Reply