వివో వెరైటీ సెల్ఫీ ఫోన్…సెల్ఫీ ఎలా తీసుకోవచ్చు అంటే?

Vivo relaesed best selfie smartphone
Share Icons:

బీజింగ్, 13 జూన్:

సెల్ఫీ కెమెరాలకు పెట్టింది పేరైనా వివో సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘నెక్స్ ఎస్‌’ను తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో మాత్రమే లభిస్తున్నది. త్వరలో దీన్ని భారత్‌లో కూడా విడుదల చేయనున్నారు. డైమండ్ బ్లాక్, రెడ్ కలర్స్‌లో 6/8 జీబీ ర్యామ్ వేరియెంట్లలో రూ.41వేలు, రూ.47వేల ధరలకు ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది.

vivo_nex_s

ఈ ఫోన్ వినియోగదారులని ఆకర్షించేలా సెల్ఫీలు తీసుకోవడానికి సరికొత్తగా రూపొందించారు. దీంట్లో ఉండే 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా యూజర్ కావాలనుకున్నప్పుడు ఫోన్ పైకి ఓపెన్ అవుతుంది. దాంతో ఫొటోలు, వీడియోలను తీసుకోవచ్చు. ఇక ఈ ఫోన్‌లో పై భాగంలో డిస్‌ప్లే కింద మైక్రో స్లిట్ ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు.

వివో నెక్స్ ఎస్ ఫీచర్లు…

  • 59 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే
  • 2316 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • 8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్
  • 6/8 జీబీ ర్యామ్, 128/256 జీబీ స్టోరేజ్
  • డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 1 ఓరియో
  • 12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ
  • డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 0 ఎల్‌ఈ
  • యూఎస్‌బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

మామాట: అంత ధర ఉన్నప్పుడు ఎన్ని వెరైటీ ఫీచర్స్ అయిన పెడతారు…

Leave a Reply