కూత మొదలైంది….. తొలి మ్యాచ్‌లో యు ముంబాతో తెలుగు టైటాన్స్ ఢీ…

vivo pro kabaddi 7th season starts today
Share Icons:

హైదరాబాద్:

 

ఇప్పటివరకు ఆరు సీజన్లలో ప్రేక్షకులని అలరించిన ప్రొ కబడ్డీ లీగ్…..ఇప్పుడు 7వ సీజన్ కూతకి సిద్ధమైంది. 12 జట్లు.. 92 రోజులు.. 137 మ్యాచ్‌లతో సుదీర్ఘంగా సాగే ఈ లీగ్.. తొలి మ్యాచ్‌లో యు ముంబాతో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలుగు టైటాన్స్ తలపడనుంది.

 

ఇక ఆరు సీజన్లుగా తెలుగు టైటాన్స్ ప్రధాన ఆటగాడైన రాహుల్ చౌదరిని ఈ సారి వేలంలో తమిళ్ తలైవాస్ సొంతం చేసుకోగా.. గతేడాది యు ముంబా తరఫున బరిలో దిగి ఉత్తమ అరంగేట్ర ఆటగాడిగా నిలిచిన సిద్ధార్థ్ దేశాయ్‌ను టైటాన్స్ చేజిక్కించుకుంది. లీగ్‌లో ఆరు సీజన్లు పూర్తైనా.. ఇప్పటి వరకు ఒక్క సారి కూడా విజేతగా నిలువలేకపోయిన టైటాన్స్.. ఈ సారి సిద్ధార్థ్‌పై భారీ అంచనాలు పెట్టుకుంది.

 

అయితే  తెలుగు రైడింగ్‌లో సిద్ధార్థ్ తురుపు ముక్కైతే.. డిఫెన్స్‌లో విశాల్ భరద్వాజ్, అబోజర్ మిఘానిపైనే జట్టు ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ఈ ముగ్గురు కలిసి కట్టుగా రాణిస్తే.. టైటాన్స్‌కు తిరుగుండదు. అటు ముంబా కెప్టెన్ ఫజల్ అట్రాచలి నాయకత్వంలో చెలరేగాలని ఆ జట్టు తహతహలాడుతున్నది. సందీప్ నర్వాల్, సురేందర్ సింగ్, యాంగ్ చాంగ్ కో, రోహిత్ బలియాన్, డాంగ్ లీతో ఆ జట్టు బలంగా ఉంది.

 

ఇక టోర్నీ జరిగే విధానం గురించి వస్తే మొత్తం 12 జట్లను రెండు జోన్‌లుగా విభజిస్తారు. ప్రతీ జట్టు ఇతర జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ అన్నమాట. జోన్‌లో అగ్రస్థానంలో నిలిచిన మూడేసి జట్లు నాకౌట్‌కు అర్హత సాధిస్తాయి.

 

తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్‌కు చెరితే.. 3 నుంచి 6వ స్థానం వరకు ఉన్న నాలుగు జట్లు రెండు ఎలిమినేటర్ మ్యాచ్‌లు ఆడతాయి. వీటిల్లో గెలిచిన జట్లు మొదటి రెండు స్థానాల్లో ఉన్న జట్లతో సెమీస్ లో తలపడతాయి. ఇక సెమీస్ లో గెలిచినవి నేరుగా తుదిపోరులో పోటీపడతాయి.

Leave a Reply