వివేకా హత్య కేసులో మలుపు…!

Viveka murder case, ci suspended
Share Icons:

అమరావతి, మార్చి22,

ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన వైస్ వివేకా హత్యకేసు రోజుకో మలుపు తీసుకుంటోంది, తాజాగా ఈ కేసులో పోలీసులకు అనుకోని షాక్ తగిలింది. పులివెందుల సీఐ శంకరయ్యను సస్పెండ్ చేసారు, హత్య జరిగిన సమయంలో ఘటనా స్థలంలో ఆధారాలను కాపాడటంలో నిర్లక్ష్యం వహించటమే ఇందుకు కారణంగా తెలుస్తుంది. ఈ మేరకు డీఐజీ నాగేంద్రకుమార్ దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.

వివేకా హత్య జరిగిన వెంటనే ఆధారాలు లభించకుండా రక్తపు మరకల్ని కడిగేయడంతో దర్యాప్తు కష్టం అవుతుందని పోలీసులు భావిస్తున్నారు.అంతకుముందు వైసీపీ నేత అవినాష్ రెడ్డి తీరు పట్ల కూడా సీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి బతికినంత కాలం వివాదాలకు దూరంగా ఉంటూ సౌమ్యుడిగా పేరు పొందిన వివేకానందరెడ్డి మరణం ఇంత వివాదాస్పదం అవ్వటం అందరిని కలిచి వేస్తోంది, అధికార ప్రతిపక్షాల మధ్య సమస్యగా మారిని వివేకా హత్యకు దారి తీసిన కారణాలేంటో తేలాలంటే పోలీసుల దర్యాప్తు స్వతంత్రంగా జరిపించాలని ఇటీవలే ఆయన కుమార్తె సునీత మీడియా ముఖంగా విన్నవించుకున్న విషయం తెలిసిందే.

మామాట: అందుకే బాగా బతకడమే కాదు బాగా పోవాలంటారు…

Leave a Reply