TRENDING NOW

వివేకా హత్య – అసలు విషయాలు చెప్పిన అవినాష్ రెడ్డి

వివేకా హత్య – అసలు విషయాలు చెప్పిన అవినాష్ రెడ్డి

కడప, మార్చి16,

దివంగత వైయస్ సోదరుడు, రాష్ట్ర మాజీ మంత్రి, ప్రతిపక్ష నేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య పై  అనేక అనుమానాలు వ్యక్తమౌతున్న నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి అన్ని విషయాలనూ బహిర్గతం చేశారు. ఆయన క‌డ‌ప‌లో మీడియాతో మాట్లాడుతూ..

GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,
treefurn AD
Life Homepathy

వైఎస్ కుంటుంబం ఉంటున్న పులివెందలలో, వారి ఇంటికే వెళ్లి వైఎస్ వివేకానందరెడ్డినే చంపామని,  ఎన్నికల ముందు వైసీపీ కార్యకర్తలను, శ్రేణుల‌ను భయపెట్టడానికే, ఈ  హత్య చేశార‌నే అనుమానం వ్య‌క్తం చేశారు. ముందుగా పెద‌నాన్న వివేకానంద‌రెడ్డి మృత‌దేహం చూసిన‌ప్ప‌టి నుండే తాము అనుమానాస్ప‌ద మృతిగా భావించామని, అయితే గుండెపోటుతో మృతి అంటూ మీడియానే త‌ప్పుడు వార్త‌లు ప్ర‌చారం చేసింద‌ని అవినాష్ రెడ్డి స్ప‌ష్టం చేశారు.

ఇక తాము పెద‌నాన్న మృత‌దేహాన్ని చూడ‌గానే హ‌త్య‌గా అనుమానం వ‌చ్చినా, రాజ‌కీయంగా కానీ, వ్యక్తిగతంగా కానీ శ‌త్రువులు ఎవ‌రూ లేక‌పోవ‌డంతో, క‌నీస స‌మాచారం లేకుండా పెద‌నాన్న‌ది హ‌త్య అని చెబితే అల్ల‌ర్లు జ‌రుగుతాయ‌ని భావించి   అనుమానాస్ప‌ద మృతిగా చెప్పామ‌ని అవినాష్ రెడ్డి తెలిపారు.

అజాతశ‌త్రువు, సౌమ్యుడుగా పేరున్న వివేకానంద‌రెడ్డిని హ్య‌త్య చేస్తార‌ని అస్స‌లు ఊహించ‌లేద‌ని, పెద‌నాన్న మృత‌దేహం ర‌క్త‌పు మ‌డుగుల్లో ఉండ‌డం చూసి, వెంట‌నే పోల‌సుల‌కు స‌మాచారం ఇచ్చామ‌న్నారు.  ఆ త‌ర్వాత అంతా పోలీసుల ముందే జ‌రిగింద‌ని, పోలీసులే పోస్ట్‌మార్టంకు తీసుకెళ్ళార‌ని తెలిపారు. ఇక పెదనాన్న మృత దేహం వ‌ద్ద‌కి తాము వ‌చ్చిన‌ప్పుడు లెట‌ర్ లేద‌ని, అయితే సాయంత్రం పోలీసులు ఈ లెటర్‌ను బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చార‌ని, దీంతో అనేక అనుమానాలు తెర‌పైకి వ‌స్తున్నాయ‌న్నారు. కనుక పెద‌నాన్న వివేకానంద‌రెడ్డి హ‌త్య వెనుక పెద్ద కుట్ర ఉంద‌ని, ఈ కేసు పై లోతైన దర్యాప్తు జరగాలని అవినాష్ రెడ్డి  డిమాండు చేశారు.

మామాట:  అంతా మంచే జరుగుతుందని ఆశిద్దాం. ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: