పున్నూ-రాహుల్ చిలిపి గొడవ: బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ టాస్క్ విన్నర్ వితికా..

vithika winner of battle of medallion task in big boss telugu
Share Icons:

హైదరాబాద్: బిగ్ బాస్ షో చివరికొచ్చేసరికి మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఒకవైపు గేమ్ లు…మరో వైపు గొడవలతో ప్రేక్షకులని ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. శుక్రవారం ఎపిసోడ్లో ఒకవైపు పునర్నవి-రాహుల్ మధ్య చిలిపి గొడవ జరగగా, బాబా భాస్కర్-వితికాల మధ్య బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ ఫైనల్ లెవెల్ జరిగింది. ఎపిసోడ్ ప్రారంభవ్వడమే బ్రేక్ ఫాస్ట్ సమయంలో రాహుల్, పునర్నవి మధ్య చిలిపి గొడవ వచ్చింది. ఖాళీగా ఉండటం ఎందుకు సంత్రాలు ఇవ్వొచ్చు కదా అని రాహుల్ పునర్నవిని అన్నాడు. దీనికి పునర్నవి ఫీలయ్యింది. రాహుల్ ఎంత కాకాపట్టినా ‘‘దయచేసి నాతో మాట్లాడొద్దు’’ అంటూ చిరాకు పడింది.

తర్వాత రాహుల్ స్మోకింగ్ రూంలో ఉన్నప్పుడు పునర్నవి వచ్చి కాకా పట్టింది. ‘‘ఇరిటేట్ చేయకు పో.. నాకు కోపం తెప్పియ్యకు. నీ మొఖం చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది’’ అంటూ పునర్నవిపై రాహుల్ రివేంజ్ తీర్చుకున్నాడు. వీరి గొడవ తర్వాత ఈ వారం బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ రెండు లెవెల్లో విన్నర్లుగా నిలిచిన వితికా, బాబా భాస్కర్ లకు ఫైనల్ రౌండ్ ఇచ్చారు. టాస్క్‌లో భాగంగా గార్డెన్ ఏరియాలో ఒక రిక్షాను ఏర్పాటుచేశారు. ఈ రిక్షాలో బాబా భాస్కర్, వితికా వీలైనంత ఎక్కువ సమయం కూర్చోవాలి. వీరిద్దరిలో ఎవరైతే ముందుగా రిక్షా దిగిపోతారో వారు ఓడిపోయినట్టు.

అలాగే బిగ్ బాస్ సమయానుసారం కొన్ని వస్తువులను పోటీదారులకు పంపిస్తూ ఉంటారు. వాటిని వారిద్దరూ ఏదో విధంగా ఉపయోగించాలి. ఈ టాస్క్‌కి పునర్నవి సంచాలకులుగా వ్యవహరించాలని బిగ్ బాస్ ఆదేశించారు. బిగ్ బాస్ పంపే వస్తువులను పునర్నవి మాత్రమే పోటీదారులకు ఇవ్వాల్సి ఉంటుందని కూడా చెప్పారు. ఇక బజర్ మ్రోగడమే ఇద్దరు సభ్యులు రిక్షా ఎక్కి కూర్చున్నారు. చాలాసేపు ఓర్పుగా కూర్చున్నారు. కొంతసేపటికి బిగ్ బాస్ ఇద్దరికి తలో మూడు చొప్పున ఆరు స్వెటర్లు ఇచ్చారు. వాటిని ఇద్దరు ధరించారు. నెక్స్ట్ ఇద్దరికీ తలో పది మిర్చిలు ఇచ్చి తినమని చెప్పారు. అవి కూడా తినేశారు.

తర్వాత బిగ్ బాస్ తెలివిగా ఇద్దరిని ఓ పెద్ద బాటిల్ యాప్పీ ఫిజ్ డ్రింక్ తాగమని సూచించాడు. దాంతో ఇద్దరు డ్రింక్ తాగరు. ఆ తరవాత బాబా భాస్కర్‌కు ఒంటేలు మొదలైంది. రిక్షా దిగకూడదు.. మరి ఎలా. శ్రీముఖి ఒక ప్లాన్ చెప్పింది. దుప్పట్లు, గొడులుగులు పట్టుకొచ్చారు. అంటే, వితిక రిక్షాపై ఉండగానే బాబా చేత ఒంటేలు పని చేయించడానికి శ్రీముఖి సిద్ధపడిపోయింది. అయితే, ఇది ఇష్టం లేక బాబాను వితిక రిక్షా మీది నుంచి తోసేసింది. దీంతో బాబా ఓడిపోగా, వితికా విన్నర్ గా నిలిచింది.

 

Leave a Reply