దోమలపై కామెంట్‌తో అసెంబ్లీలో నవ్వులు పూయించిన విష్ణు కుమార్…

AP BJP MLA VishnuKumar Raju sensation
Share Icons:

అమరావతి, 10 సెప్టెంబర్:

అమరావతిలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమం గురించి చర్చ జరిగింది.

దీనిపై విష్ణు కుమార్ రాజు స్పందిస్తూ అసెంబ్లీలో నవ్వులు పూయించారు. మంత్రులు, అధికారులు ఎంత కష్టపడి పనిచేసినా దోమలపై దండయాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో 2,80,000 మందికి జ్వరాలు వచ్చాయనీ, వీరిలో తన కుమారుడు కూడా ఉన్నాడని తెలిపారు.

‘దోమలకు విచక్షణ ఏమీ ఉండదు అధ్యక్ష్యా. అవి అందరినీ కుట్టేస్తున్నాయ్. అధ్యక్షా.. ఇంతకు ముందు మా కామినేని శ్రీనివాస్‌ ఆరోగ్య మంత్రిగా ఉండేవారు. ఆయన పదవి నుంచి తప్పుకోగానే ప్రజలపై దోమల పోరాటం ఎక్కువైపోయిందని ఎద్దేవా చేశారు.

అధ్యక్షా (స్పీకర్) మీరు కూడా డాక్టరే.. మిమ్మల్ని కూడా దోమలు కుట్టేస్తాయ్. అసలు ఇది మంత్రికి సంబంధించిన విషయమా లేక మున్సిపాలిటీకి సంబంధించిన విషయమా?’ అంటూ ప్రశ్నించడంతో సభ మొత్తం నవ్వులు విరిశాయి.

విష్ణుకుమార్ రాజు తన ప్రసంగాన్ని ముగిస్తూ.. ఇప్పటికైనా జాగ్రత్తలు తీసుకోకుంటే రాష్ట్రంలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందిపడతారని హెచ్చరించారు.

మామాట: దోమలకి సీఏం అయినా సామాన్యుడు అయినా ఒకటేగా…

 

Leave a Reply