విశాఖలో ఎవరి లెక్కలు వారికి ఉన్నాయిగా…

Share Icons:

విశాఖపట్నం, 6 మే:

విశాఖపట్నంలో మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న టీడీపీ…పోలింగ్ అనంతరం ఎన్ని సీట్లలో తమకు ఆధిక్యం ఉందో తేల్చుకునే పనిలో పడింది. తాను చేయించుకున్న సర్వేలో వైసెపీకి అయిదు సీట్లు మాత్రమే వస్తాయని తేల్చేసింది.

విశాఖ అర్బన్ జిల్లాలోని భీమునిపట్నం, రూరల్ జిల్లాలోని మాడుగుల, చోడవరం , పాడేరు. అరకు సీట్లు వైసీపీ ఖాతాలో టీడీపీ నేతలు వేశారు. మిగిలిన పదిలో పవన్ కళ్యాణ్ గాజువాక నుంచి గెలిస్తే తొమ్మిది సీట్లలో టీడీపీ విజయకేతనం ఎగురవేస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. విశాఖ ఈస్ట్, విశాఖ వెస్ట్, పెందుర్తి, విశాఖ సౌత్, నార్త్ సీట్లు, నర్శీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి టీడీపీకే వస్తాయని అంచనా వేస్తున్నారు.

అదే విధంగా విశాఖ, అనకాపల్లి ఎంపీ సీట్లు టీడీపీ ఖాతాలో పడతాయని, అరకు ఎంపీ సీట్లో మాత్రం టైట్ ఫైట్ ఉంటుందని భావిస్తున్నారుట. టీడీపీ చేసిన సర్వేను వైసీపీ నేతలు కొట్టి పారేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లు మాత్రమే సాధించిన తమ పార్టీకి టీడీపీ నేతలే అయిదు సీట్లు ఇస్తే జనం రెట్టింపు సీట్లు ఇస్తారని వారు కచ్చితంగా చెబుతున్నారు. టీడీపీ చెబుతున్నట్లుగా ఆ పార్టీ గెలుపు అంత సులువు కాదని అన్ని చోట్లా హోరా హోరీ జరిగిందని, పదికి తగ్గకుండా వైసీపీ ఖాతాలో అసెంబ్లీ సీట్లు, రెండు పార్లమెంట్ సీట్లు  వస్తాయని అంటున్నారు.

మామాట: మరి చూద్దాం ఫలితాల్లో ఎవరి లెక్క కరెక్ట్ అవుతుందో

Leave a Reply