మొత్తానికి బాలయ్య చిన్నల్లుడుకి టికెట్ దక్కింది….

Share Icons:

విశాఖపట్నం, 19 మార్చి:

విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు… గీతం యూనివర్సిటీ ఎంవీవీఎస్ మూర్తికి మనుమడు భరత్ పోటీ చేయడం ఖాయమైంది.  విశాఖలో సోమవారం సమావేశమైన  జిల్లా టిడిపి నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, విశాఖ అభ్యర్థిగా ఎవరిని ప్రకటించాలన్న అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో మెజార్టీ నేతలు శ్రీభరత్ వైపే మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. జిల్లా నేతలు కూడా భరత్ వైపే మొగ్గుచూపడంతో టీడీపీ ప్రకటించిన 25 మంది లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో భరత్ చోటు దక్కించుకున్నారు.

విశాఖ లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సినీ నిర్మాత-రియల్టర్ ఎంవీవీ సత్యనారాయణతో శ్రీభరత్ తలపడనున్నారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ మద్దతుతో బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి కంభంపాటి హరిబాబు…వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మపై విజయం సాధించారు. ఈ ఎన్నికల్లోనూ విశాఖలో పసుపు జెండా ఎగురవేస్తామని టీడీపీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు.
మామాట: టికెట్ దక్కింది…మరి విజయం…

Leave a Reply