విశాఖ తూర్పులో హోరాహోరీ…

Share Icons:

విశాఖపట్నం, 30 మార్చి:

నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఏర్పడిన విశాఖ తూర్పులో జరిగిన రెండు ఎన్నికల్లో వరుసగా  టీడీపీ అభ్యర్ధి వెలగపూడి రామకృష్ణబాబు విజయం సాధించారు. ఈసారి కూడా ఆయనే మరోసారి పోటీలో ఉన్నారు. నిత్యం ప్రజల్లో వుండడం వెలగపూడికి కలిసొచ్చే అంశం. ఆయన్ను ఎప్పుడు ఎవరైనా నేరుగా కలుసుకునే అవకాశం ఉంటుంది.

ఈ నేపథ్యంలో వెలగపూడిని ఢీకొట్టే నేత కోసం అన్వేషించిన వైసీపీ మల్లా విజయప్రసాద్‌ను తెరపైకి తీసుకొచ్చింది. వెలగపూడికి మల్లానే సరైన పోటీనని భావించిన పార్టీ అధిష్ఠానం ఆయనకు టికెట్‌ను కేటాయించింది. ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఉన్నందున ఆ వర్గానికి చెందిన నేతనే వైసీపీ ఖరారు చేసింది. ఇదే వైసీపీకి కలిసొచ్చే అంశం. అయితే జనసేన పోటీలో ఉండటం వలన ఎవరికి నష్టం కలుగుతుందో చెప్పలేం.

ఈ నియోజవర్గంలో కాపులు, యాదవులు, మత్స్యకారులు, రెడ్లు, ఇతర సామాజిక వర్గాలున్నారు. ప్రధానంగా కాపులు, యాదవులు, మత్స్యకారులు నిర్ణయాక శక్తిగా ఉన్నారు.

మామాట: ఈ హోరాహోరీ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో

Leave a Reply