ధోనీ, కోహ్లీ లేకుండా బంగ్లాతో తలపడనున్న యువ జట్టు…రాణిస్తుందా?

Virat Kohli's rest and MS Dhoni's future on the radar as selectors meet to pick squad
Share Icons:

ముంబై: దక్షిణాఫ్రికాపై టీ20, టెస్ట్ సిరీస్ లని గెలిచిన మంచి ఊపు మీదున్న టీమిండియా నవంబర్3 నుంచి బంగ్లాదేశ్ జట్టుతో తలపడనుంది. అయితే ఈ సిరీస్ లో భాగంగా మూడు టీ20లు, రెండు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. నవంబర్ 3, 7,10 తేదీల్లో టీ20 లు జరుగుతాయి. నవంబర్ 14, 22 తేదీల్లో టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. అయితే టెస్ట్ మ్యాచ్ లకు దక్షిణాఫ్రికాతో తలపడిన జట్టునే ఎంపికగా చేయగా, టీ20లకు మాత్రం అనేక మార్పులు చేశారు.

ఈ మ్యాచ్ ల్లో కోహ్లీ, జడేజా, ధోనీలు ఆడటం లేదు. ఇక గాయాల కారణంగా హర్ధిక్ పాండ్యా, బుమ్రా, భువనేశ్వర్ లు టీం లో తప్పుకున్నారు. రోహిత్ కెప్టెన్ గా టీ20 మ్యాచ్ ల్లో కుర్రాళ్ళు ఆడనున్నారు. అయితే మునుపటిలా బంగ్లాదేశ్ ఇప్పుడు పసికూన కాదు. ఆ జట్టు పొట్టి ఫార్మాట్ ల్లో బాగా రాణిస్తుంది. ఇలాంటి సమయంలో కుర్రాళ్ళతో ప్రయోగాలు చేయడం వల్ల టీమిండియా సక్సెస్ అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. మరి చూడాలి ఏ మేర యువ జట్టు రాణిస్తుందో.

అయితే సెలక్షన్ లో భాగంగా పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి టీ20 సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చింది. సూపర్ ఫామ్‌లో ఉన్న రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. కొంత కాలంగా ఇండియా-ఏ తరఫున నిలకడగా రాణిస్తున్న ముంబై యువ ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఎట్టకేలకు పొట్టి సిరీస్‌కు తొలిసారిగా ఎంపికయ్యాడు. అలాగే టీ20 జట్టులోకి వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్, స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పునరాగమనం చేశారు. రెండు ఫార్మాట్లలోనూ వికెట్ కీపర్ పంత్‌కు చోటు దక్కింది.

బంగ్లాదేశ్‌తో సిరీస్‌కు జట్టు ఎంపికకు ముందే టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ ధోనీతో మాట్లాడామని చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహించాలన్న ఆలోచనలకు మహీ కూడా మద్దతు తెలిపాడని అన్నాడు. రిటైర్మెంట్‌పై తుదినిర్ణయం ధోనీ వ్యక్తిగతమని అభిప్రాయపడ్డాడు. అలాగే కీపర్ పంత్‌కు మద్దతు కొనసాగిస్తామని స్పష్టం చేశాడు.

టీ20 జట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్), శిఖర్ ధవన్, కేఎల్ రాహుల్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషభ్ పంత్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, కృనాల్ పాండ్య, యజువేంద్ర చాహల్, రాహుల్ చాహర్, దీపక్ చాహర్, ఖలీల్ అహ్మద్, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్

టెస్టు జట్టు : విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజార, అజింక్య రహానే, హనుమ విహారి, సాహా(వికెట్‌కీపర్), జడేజా, అశ్విన్, కుల్దీప్, షమీ, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మ, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్

Leave a Reply