గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు…నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ..

Share Icons:

అమరావతి, 24 జూన్:

‘గ్రామ సెక్రటేరియట్‌’ వాలంటీర్ల ఉద్యోగాలు భర్తీకి గాను ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ప్రకారం ఈరోజు నుంచి గ్రామ సెక్రటేరియట్‌లో ఆన్ లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మొత్తం 13 జిల్లాల్లో 1,84,498 మంది గ్రామ వాలంటీర్ల నియామకాలు జరగనున్నాయి.

తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 21,600 మంది వాలంటీర్ల కోసం ప్రకటన వెలువడింది. 50 కుటుంబాలకో వాలంటీర్‌ చొప్పున జిల్లాల వారీగా లెక్కలు కట్టి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు. అవసరాన్ని బట్టి వాలంటీర్ల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇక ఒక్కో వాలంటీర్‌కు రూ. 5 వేల వేతనం ఇవ్వనున్నారు. అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. గ్రామ వాలంటీర్లలో 50 శాతం పోస్టులు మహిళలకు కేటాయించడం జరుగుతుంది. ఎక్కడైతే జాబ్‌కు అప్లై చేసుకుంటారో వాళ్లు సంబంధిత గ్రామ వాసిగా ఉండాలి.

కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ ఉండాలని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు.. గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల్లో పదవ తరగతి విద్యార్హత ఉంటే సరిపోతుంది. సోమవారం నుంచి gramavolunteer.ap.gov.in  వెబ్‌సైట్‌ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా దరఖాస్తులు పెట్టుకోవాలి.

ఇక జూలై 5వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 11 నుంచి 25 తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.

Leave a Reply