ఏపీలో గ్రామ సచివాలయ పోస్టులు….91652 ఉద్యోగాలని భర్తీ చేయనున్న ప్రభుత్వం…

village secretary recruitment 2019
Share Icons:

అమరావతి:

 

సీఎం వైఎస్ జగన్… నవరత్నాల హామీల్లో ఒకటైన యువతకు ఉపాధిలో భాగంగా విలేజ్ వాలంటీర్ల భర్తీ చేపట్టిన విషయం తెలిసిందే. ఇక దీనికి కొనసాగింపుగా ఆయన తాజాగా గ్రామ సచివాలయాల ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మార్గదర్శక ఉత్తర్వులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ… జులై 19న ఉత్తర్వును విడుదల చేసింది. 91,652 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌‌ను రెండు మూడు రోజుల్లో విడుదల చేయబోతోంది.

 

అయితే రాష్ట్రం మొత్తం మీద ప్రస్తుతం ఖాళీగా ఉన్న పోస్టులు 14,098 మాత్రమే. కానీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెడుతూ… అదనంగా 77,554 కొత్త పోస్టుల్ని ఇవ్వబోతోంది. జూలై 23 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉంది.

 

ఇక్ గ్రామ సచివాలయంలో ఉద్యోగాలకు ఆబ్జెక్టివ్ టైపులో… ఆఫ్ లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ప్రభుత్వం ప్రత్యేక సిలబస్‌ను గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగాల కోసం రూపొందిస్తున్నట్లు తెలిసింది. గ్రామ సచివాలయ ఉద్యోగాల కోసం 150 మార్కుల పరీక్షను 2 గంటల 30 నిమిషాలపాటూ నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కుల్ని బట్టీ అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

 

అయితే వీటికి ఇంటర్వ్యూలేవీ ఉండవు. 150 మార్కుల పరీక్షలో… 75 మార్కులు ఉద్యోగానికి సంబంధించినవి, మిగతా 75 జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించినవి ఉంటాయి. 18 నుంచీ 42 ఏళ్ల యువకులు వీటికి అప్లై చేసుకోవచ్చు.

 

అలాగే వార్డ్ సచివాలయ ఉద్యోగాల కోసం నిర్వహించే 150 మార్కుల పరీక్షలో 50 మార్కులు సిలబస్‌పై ఉంటాయి. మరో 50 జనరల్ నాలెడ్జ్‌పై, మిగతా 50 పర్సనాల్టీ (వ్యక్తిత్వ వికాసం)పై ఉంటాయని తెలిసింది. ఇక పరీక్షల్లో సెలెక్ట్ అయిన వారికి అపాయింట్‌మెంట్ లెటర్స్ ఇస్తారు. ఆ తర్వాత బాపట్ల, సామర్లకోట, శ్రీకాళహస్తిలోని పంచాయతీ ట్రైనింగ్ సెంటర్లలో ట్రైనింగ్ ఉంటుంది. అక్టోబర్ 2 నుంచీ ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది.

Leave a Reply