TRENDING NOW

రాజకీయ రాజధానిలో పాగా వేసేదెవరో?

రాజకీయ రాజధానిలో పాగా వేసేదెవరో?

విజయవాడ, 14 మార్చి:

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజధానిగా ఉన్న విజయవాడ లోక్‌సభలో ఈ సారి గట్టి ఫైట్ జరగనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ఈ స్థానాన్ని కైవసం చేసుకోడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున కేశినేని నాని విజయవాడ ఎంపీగా విజయం సాధించారు. ఇక ఈ సారి కూడా కేశినేని నాని టీడీపీ ఎంపీగా మరోసారి బరిలో ఉండనున్నారు. పార్లమెంట్ పరిధిలో చేసిన అభివృద్ధి మరోసారి తనని గెలిపిస్తుందని ఆయన ధీమాగా ఉన్నారు.

treefurn AD
Life Homepathy
GCR Infra AD, Maamaata, SEO, Primepagesinfo,

అలాగే రాజధాని నగరం అమరావతికి దగ్గర ఉండటంతో టీడీపీ అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో విజయవాడ రూపు రేఖలు మారిపోయాయని ప్రజలు కూడా చర్చించికుంటున్నారు. అటు ఈ సారి  ఎలా అయిన విజయవాడ ఎంపీ స్థానాన్ని దక్కించుకోవాలని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త దాసరి జై రమేశ్‌ను తమ పార్టీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపాలని వైసీపీ నిర్ణయించుకుంది. కానీ దాసరి పోటీకి విముఖత చూపడంతో విజయవాడ వైసీపీ అభ్యర్థి రేసులో మరో పారిశ్రామిక వేత్త పీవీపీ(పొట్లూరి వరప్రసాద్) పేరు తెరపైకి వచ్చింది.

తాజాగా వైసీపీలో చేరిన ఆయనకి విజయవాడ ఎంపీగా పోటీ చేయనున్నారని ప్రకటించింది. ఇక పీవీపీ కూడా ఎన్నికల బరిలో దిగడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. అయితే అభ్యర్ధులు ఇద్దరు ఒకే సామాజికవర్గం వారు అలాగే ఆర్ధికంగా బలంగా ఉన్నవారు.  దీంతో పోటీ గట్టిగానే ఉంటుంది. కాగా, విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న విజయవాడ ఈస్ట్, సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేటలని కూడా టీడీపీ గెలుచుకుంది. అలాగే విజయవాడ వెస్ట్, తిరువూరులని వైసీపీ గెలుచుకుంది. మరి చూడాలి ఈసారి రాజకీయ రాజధానిని ఎవరు కైవసం చేసుకుంటారో.

మామాట: విజయవాడలో విజయం ఎవరిదో మరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Menu
%d bloggers like this: